Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ హీరో నెక్స్ట్ ఫిక్స్ అయిందోచ్

By:  Tupaki Desk   |   21 May 2019 1:35 PM IST
ఇస్మార్ట్ హీరో నెక్స్ట్ ఫిక్స్ అయిందోచ్
X
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్లో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నటిస్తునాడనే సంగతి తెలిసిందే. ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడనే విషయంపై గత కొన్ని రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా ఈ విషయం కన్ఫాం అయిపోయింది.

రామ్ కు 'నేను శైలజ' లాంటి సూపర్ హిట్ అందించిన కిషోర్ తిరుమలతో మరోసారి జట్టు కట్టేందుకు రామ్ రెడీ అవుతున్నాడట. వీరిద్దరి కాంబోలో 'నేను శైలజ' మాత్రమే కాకుండా 'ఉన్నది ఒకటే జిందగీ' కూడా తెరకెక్కింది. అయితే ఈ సినిమా మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రామ్-కిషోర్ తిరుమల కలిసి సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే కిషోర్ తిరుమల లాస్ట్ ఫిలిం 'చిత్రలహరి' బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. వరసగా ఆరు ఫ్లాపులతో సతమతమవుతున్న మెగా హీరో సాయి తేజ్ కు ఈ సినిమాతో హిట్ అందించి కిషోర్ తిరుమల పెద్ద రిలీఫే ఇచ్చాడు.

ఈమధ్యే కిషోర్ ఒక ఇంట్రెస్టింగ్ కథ విన్పించడంతో రామ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తారని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోందని సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.