Begin typing your search above and press return to search.

అంతా సన్నీ డియో డియో మహిమే

By:  Tupaki Desk   |   1 Nov 2017 7:40 AM GMT
అంతా సన్నీ డియో డియో మహిమే
X
ఒకప్పుడు యాంగ్రీ సీన్స్ తో విజిల్స్ వేయించిన హీరో రాజశేఖర్ బాక్స్ ఆఫీస్ హిట్స్ ని చాలానే చూశారు. కానీ గత కొంత కాలంగా ఆయనకు సరైన కథ దొరక్కపోవడంతో విజయాన్ని అందుకోలేకపోతున్నారు. అయితే ఈ సారి తనకు కరెక్ట్ సెట్ అయ్యే సినిమా గరుడవేగా అని తన నుండి ప్రేక్షకులు కోరుకుంటున్న అసలైన సినిమా చేశానని మీడియా సమావేశాల్లో రాజశేఖర్ చెబుతున్నారు.

సినిమా ప్రమోషన్స్ ని కూడా చిత్ర యూనిట్ భారీగా చేస్తోంది. ముఖ్యంగా సన్నీ లియోన్ తో సినిమాలో డియో డియో అనే ఐటెమ్ సాంగ్ ను చేయించిన సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ ఎక్కువగా సన్నీ సాయంతోనే ప్రమోషన్స్ ని చేస్తోంది. ప్రస్తుతం ఆ పాట చాలా పాపులర్ అయ్యింది. ఆ పాట మేకింగ్ వీడియో చుసిన వారు డియో డియో అనకుండా ఉండడం లేదు. సినిమా ఎలా ఉంటుందో తెలియదు గాని చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో చేస్తోంది.

ఇక రాజశేఖర్ అయితే తన సినీ జీవితంలో ఏ సినిమాకి చేయని విధంగా ఈ సినిమాకి ప్రమోషన్ ను చేస్తున్నాడు. స్టార్ హీరోల మద్దతు కూడా అందుకుంటున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ సహాయాన్ని అందుకున్న ఈ హీరో మెగాస్టార్ కూడా ట్రైలర్ ని చూసి మెచ్చుకున్నారని చెప్పాడు. మీడియా ఇంటర్వ్యూలలో కూడా చాలానే పాల్గొంటున్నాడు. రీసెంట్ గా ఓ ఎఫ్‌ ఎం స్టేషన్‌ కి వెళ్లిన హీరో రాజశేఖర్ అక్కడ డియో డియో స్టెప్పులతో అలరించాడు. పూజ కుమార్‌ - శ్రద్ధా దాస్‌ కూడా ఆయనతో కలిసి స్టెప్పులు వేశారు.