Begin typing your search above and press return to search.
దర్శి టైమ్ నడుస్తోంది.. ఆఫర్లు ఆగట్లేదుగా..
By: Tupaki Desk | 7 April 2023 5:21 PM ISTఒక సినిమాలో హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాకుండా కమెడియన్లు, విలన్లు కూడా కీలక పాత్ర పోషిస్తుంటారు. ముఖ్యంగా మన తెలుగు సినీ రంగంలో ఉన్నంత మంది కమెడియన్లు మరే ఇతర సినీ రంగాల్లోనూ ఉండరనుకుంట. అయితే ముందుగా సినీ రంగంలో అడుగు పెట్టిన కమెడియన్లు ఆ తర్వాత హీరోలుగా మారడం.. స్టార్ హీరోలుగా ఎదగడం కూడా మనకు తెలిసిన విషయమే.
గతం నుంచి టాలీవుడ్ లో ఈ ట్రెండ్ నడుస్తోంది. హీరో సునీల్, అల్లరి నరేష్, బ్రహ్మానందం, బాబు మోహన్ లు కూడా గతంలో కమెడియన్లుగా చేసి.. కొన్ని సినిమాలకు హీరోలు అయ్యారు. తాజాగా ఇదే కోవలో కి చేరిపోయాడు హీరో ప్రియదర్శి. ప్రియదర్శి కామెడీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సైలెంట్ గా వచ్చి సూపర్ డూపర్ హిట్టు కొట్టిన పెళ్లి చూపులు సినిమాలో ప్రియదర్శి కామెడీ చూసి కడుపుబ్బా నవ్వారు అభిమానులు.
ఆ సినిమాలో ప్రియదర్శి కామెడీ టైమింగ్ బాగుండడంతో... వరుస చిత్రాల్లో ఛాన్స్ కొట్టేశాడు. ఎక్కువగా కమెడియన్ గానే చేసినప్పటికీ.. ఆ తర్వాత హీరోగాను ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా జాతిరత్నాలు చిత్రంలో హీరోకి తగ్గ పాత్ర చేసి అందరినీ అలరించాడు. హృద్యమైన కథతో తెరకెక్కించిన మల్లేశం సినిమాలో నటించి అందరినీ ఏడిపించాడు. ఓ అద్భుతమైన సక్సెస్ స్టోరీని చూపించాడు.
తాజాగా బలగం చిత్రంతోనూ హిట్టు కొట్టాడు. నిజానికి మల్లేశం, బలగం చిత్రాలు ప్రియదర్శిని స్థాయిని విపరీతంగా పెంచేశాయి. తన ఇమేజ్ కి, కామెడీ టైమింగ్ కు అస్సలు సూట కాని చిత్రాలే అయినా తాను అలాంటి చిత్రాలు కూడా చేయగలనని నిరూపించాడు. హీరోగా మారానని.. కామెడియ న్ గా మాత్రం వెనకడుగు వేయలేదు. ఏడాదికి ఒక సినిమాలో హీరోగా చేస్తూనే.. మరెన్నో సినిమాల్లో కమెడియన్ గా కనిపిస్తున్నాడు.
బలగం బ్లాక్ బస్టర్ హిట్టు అయ్యే సరికి ప్రియదర్శికి క్రేజ్ పెరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మార్కెట్ విలువ 2 కోట్లు అయిందని అంటున్నారు. హీరోగా రెండు కోట్లు రెమ్యునరేషన్ అడుగుతూనే.. కమెడియన్ గా తన పాత్ర పరిధి, అందుకు తగ్గట్టుగా తక్కువ పారితోషికమే అడుగుతున్నాడట. ఏమైనా మనోడికి విపరీతమైన గిరాకీ పెరిగిపోయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.