Begin typing your search above and press return to search.

ఒక్క హిట్ లేకున్నా కొత్త హీరో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ లు

By:  Tupaki Desk   |   13 July 2023 3:24 PM IST
ఒక్క హిట్ లేకున్నా కొత్త హీరో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ లు
X
ఫ్యామిలీ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న శ్రీకాంత్ తనయుడు రోషన్‌ చిన్నప్పటి నుండే సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నాడు. తాజాగా ఫుల్ టైమ్ హీరోగా 'పెళ్లి సందడి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. హీరోగా రోషన్‌ కి మొదటి సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ ను తెచ్చి పెట్టలేక పోయింది. కానీ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా నటన బాగుంది అంటూ పాజిటివ్ మార్కులు సొంతం చేసుకున్నాడు.

రోషన్‌ లుక్స్ ఇంకా క్రేజ్‌ నేపథ్యంలో అతడితో వర్క్‌ చేసేందుకు చాలా మంది తెలుగు దర్శకులతో పాటు పలు భాషలకు చెందిన దర్శకులు కూడా ఆసక్తి చూపించారు. కానీ రోషన్‌ మాత్రం ఇప్పటి వరకు తన వద్దకు వచ్చిన పలు ఆఫర్లను సున్నితంగా తిరష్కరిస్తూ వైజయంతి మూవీస్ బ్యానర్‌ లో ఒక సినిమాను కమిట్ అయ్యాడు. ఆ సినిమా తో పాటు నంద కిషోర్ దర్శకత్వంలో మరో సినిమా ను చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమా లు గా రాబోతున్నాయి. ముఖ్యంగా కన్నడ దర్శకుడు నంద కిషోర్ రూపొందిస్తున్న సినిమా తో రోషన్ కి కచ్చితంగా పాన్ ఇండియా స్టార్‌ డమ్ వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా లో రోషన్ కి తండ్రి పాత్ర లో సూపర్ స్టార్‌ మోహన్ లాల్ కనిపించబోతున్నాడు.

విభిన్నమైన పీరియాడికల్‌ ఎమోషనల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా లో రోషన్‌.. మోహన్ లాల్ కాంబో సన్నివేశాలు నభూతో అన్నట్లుగా ఉంటాయని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

రోషన్‌ నుండి సినిమా చాలా ఆలస్యం అవుతుందని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా సంతృప్తి చెందే విధంగా ఆలస్యంగా అయినా ఒక మంచి సినిమా రాబోతుందని రోషన్ సన్నిహితులు అంటున్నారు.

వైజయంతి మూవీస్ బ్యానర్‌ లో రోషన్‌ హీరోగా నటిస్తున్న సినిమా కు ప్రదీప్‌ అద్వైతం దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన ఆ సినిమా ప్రీ లుక్ సినిమాపై ఆసక్తి ని పెంచడంలో సక్సెస్ అయింది. విభిన్నమైన లవ్‌ స్టోరీ తో సినిమా ఉండబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.