Begin typing your search above and press return to search.

నితిన్ పెళ్లిలో టాప్ 5 ముఖ్య అతిథులు

By:  Tupaki Desk   |   21 July 2020 11:00 AM IST
నితిన్ పెళ్లిలో టాప్ 5 ముఖ్య అతిథులు
X
నితిన్ పెళ్లి ఈనెల 26న శాలిని కందుకూరితో జ‌ర‌గ‌నుంది. హైద‌రాబాద్ ఓల్డ్ సిటీలోని ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ హోట‌ల్లో వివాహం జ‌ర‌గ‌నుండగా.. ఈ వేడుక‌కు ఎంత‌మంది ప్ర‌త్యేక అతిథులు హాజ‌రు కానున్నారు? అంటూ అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది.

మ‌హ‌మ్మారీ కార‌ణంగా ఇరు కుటుంబ స‌భ్యులు ప‌రిమితంగానే అతిథుల్ని ఆహ్వానించార‌ని స‌మాచారం. ఇందులో ముఖ్యంగా నితిన్ ఫేవ‌రెట్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ .. ఫేవ‌రెట్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ అటెండ‌వుతారు. అలాగే త‌న స్నేహితుడు అయిన మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హాజ‌రుకానున్నార‌ట‌. ఆ ముగ్గురికీ ఇప్ప‌టికే నితిన్ నుంచి ఆహ్వానం అందింది. త్రివిక్ర‌మ్ అ..ఆ లాంటి క్లాసిక్ హిట్ ని ఇచ్చారు నితిన్. ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రి మ‌ధ్యా అనుబంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఇక ప‌వ‌న్ కి నితిన్ ఎంత‌టి వీరాభిమానినో చెప్పాల్సిన ప‌నే లేదు. నితిన్ హీరోగా ప‌వ‌న్ - త్రివిక్రమ్ జోడీ `చ‌ల్ మోహ‌న‌రంగ` అనే చిత్రాన్ని నిర్మించారు.

ఇక నితిన్ పెళ్లిలో సంద‌డి చేసే రాజ‌కీయ ప్ర‌ముఖులు ఎవ‌రెవరు? అంటే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ .. ఆయ‌న వార‌సుడు అయిన ఐటీ మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నార‌ట‌. కోవిడ్ ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. కేవ‌లం 50 మంది అతిథుల‌కు అవ‌కాశం ఉన్నా ఇంకా త‌క్కువ మందే ఉండే అవ‌కాశం ఉందిట‌. ఫ‌ల‌క్ నుమాలో ఆతిథ్యం అంటే ఓ రేంజులోనే ఉంటుంది. స‌ల్మాన్ ఖాన్ సోద‌రి అర్పితా ఖాన్.. త‌మిళ హీరో ఆర్య వివాహం ఇక్క‌డే జ‌రిగిన సంగ‌తి విధిత‌మే.