Begin typing your search above and press return to search.
నితిన్ పెళ్లి ఇంకో ఐదు రోజుల్లోనే
By: Tupaki Desk | 21 July 2020 9:00 AM ISTనిఖిల్ ఇప్పటికే ఓ ఇంటివాడయ్యాడు. రానా ఆగస్టులోనే పెళ్లికి రెడీ అవుతున్నాడు. వీళ్లకంటే ముందే నితిన్ కూడా పెళ్లి బాజాకు రెడీ అయినా ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఎగ్జోటిక్ లొకేషన్ లో సెలబ్రేషన్స్ నడుమ పెళ్లి జరగాలన్న కోరిక తీరలేదు. ఎట్టకేలకు హైదరాబాద్ లో సింపుల్ వివాహానికి ఓకే చెప్పాల్సి వచ్చింది. మహమ్మారీ విజృంభణ అంతకంతకు పెరుగుతుంటే పెళ్లి కొడుకుల పరిస్థితి ఇలానే ఉంది మరి.
ఏప్రిల్ 16 ముహూర్తానికి షాలినిని నితిన్ పెళ్ళాడాల్సినది అనూహ్యంగా మహమ్మారీ ప్రవేశంతో వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కావాలని కలలు కన్నా అది సాధ్యపడలేదు. అనంతరం ప్లాన్ మారింది.
ఇప్పుడు కొత్త వెడ్డింగ్ డేట్ జూలై 26. హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్ హౌస్ వేదికగా.. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ పరిమిత బంధుమిత్రుల సమక్షంలోనే పెళ్లి జరగనుంది. ఇక ఈ పెళ్లి సంబరాల్లో భాగంగా ఒక్కో ఫోటోని నితిన్ సోషల్ మీడియా టీమ్ రిలీజ్ చేస్తోంది. ఇదిగో ఇలా రోకలి పట్టిన పెళ్లికొడుకు పెళ్లికూతరు రోటిలో దంచుతూ సంబరాన్ని పీక్స్ కి చేర్చారు. ఇది త్రోబ్యాక్ ఫోటోనే. ఇందులో ఇరు కుటుంబాల సభ్యులు ఉన్నారు. ఇక మరో ఐదురోజుల్లోనే నితిన్ పెళ్లి. వివాహానంతరం నితిన్ తదుపరి `రంగ్ దే` చిత్రీకరణకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది.