Begin typing your search above and press return to search.

వాయిదా వేసినందుకు క్షమించండి - నితిన్

By:  Tupaki Desk   |   15 Oct 2015 6:29 PM GMT
వాయిదా వేసినందుకు క్షమించండి - నితిన్
X
అనుకున్నంతా అయింది. అనుమానమే నిజమైంది. దసరా పండక్కి అఖిల్ రావడం కష్టం అని ఇన్నాళ్లూ అనుమానాలే. ఇప్పుడు కన్ఫాం అయిపోయింది. నిర్మాత నితిన్ స్వయంగా చెప్పేశాడు. ట్విట్టర్ సాక్షిగా అఖిల్ వాయిదా వేస్తున్నాడు ప్రకటించేశాడు నితన్.

"గ్రాఫిక్స్ వర్క్ పూర్తికాకపోవడంతో అఖిల్ ను అక్టోబర్ 22న రిలీజ్ చేయలేకపోతున్నాం. ఆలస్యం అవుతున్నందుకు సారీ.. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేస్తాం. క్షమించండి" - ఇదీ నితిన్‌ ట్వీట్... గ్రాఫిక్ బేస్డ్ సినిమాలతో వచ్చే సమస్యే ఇది. అవుట్ పుట్ సరిగా లేకపోతే దెబ్బ పడిపోతుంది. అందుకే నాగార్జున కంగారు పడద్దని, ఆలస్యమయినా పక్కాగా రిలీజ్ చేద్దామని చెప్పడంతో.. అఖిల్ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేయక తప్పలేదని తెలుస్తోంది. ఏమైనా నెల రోజుల ముందే రిలీజ్ డేట్ ప్రకటించి మరీ.. వాయిదా వేసుకోవాల్సి రావడం.. ఆశ్చర్యకరమైన విషయమే.

ఇకపోతే అఖిల్‌ పోస్టుపోన్‌ అవ్వడం అనేది.. ఇప్పటికే బ్రూస్‌ లీ సినిమా వాయిదా కోసం ఒంటి కన్నుతో వెయిటింగ్‌ చేస్తున్న రుద్రమదేవికి ఫుల్‌ బూస్టే. రామ్‌ చరణ్‌ కు కూడా ఎలాగో ప్లస్సనేది మనకు తెలిసిందే.