Begin typing your search above and press return to search.

ఆమె ఒప్పుకుంది..జీవితంలో మరో సాహసానికి సిద్దమయ్యా అంటున్న నిఖిల్

By:  Tupaki Desk   |   4 Feb 2020 10:00 AM IST
ఆమె ఒప్పుకుంది..జీవితంలో మరో సాహసానికి సిద్దమయ్యా అంటున్న నిఖిల్
X
తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకొని సినీ ప్రస్థానం కొనసాగిస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్. విభిన్న తరహా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ బ్యాచిలర్ కుర్రాడు ఇక ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ యువ హీరో నిశ్చితార్థం జరిగింది. డా. పల్లవిని ప్రేమించిన నిఖిల్.. ఏప్రిల్ 16న ఆమెను పెళ్లాడబోతున్నాడు. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా తన పెళ్లిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన నిఖిల్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. కాబోయే భార్యతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ''ఎస్.. ఆమె ఒప్పుకుంది. జీవితంలో తర్వాతి సాహసానికి రెడీ అవుతున్నాం'' అని పేర్కొన్నాడు. దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆయనకు బెస్ట్ విషెస్ చెబుతూ ఆ ట్వీట్ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిఖిల్- పల్లవిలకు సంబంధించిన పిక్స్ హవా నడుస్తోంది.

ఇకపోతే ఈ మధ్యే 'అర్జున్ సురవరం' అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ఆకట్టుకున్న నిఖిల్.. తన తర్వాతి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ' సీక్వెల్ గా రాబోతున్న 'కార్తికేయ 2' సినిమాలో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.