Begin typing your search above and press return to search.

హీరో నిఖిల్ సీక్రెట్ పెళ్లి.. ముహూర్తం ఫిక్స్!

By:  Tupaki Desk   |   13 May 2020 2:40 PM IST
హీరో నిఖిల్ సీక్రెట్ పెళ్లి.. ముహూర్తం ఫిక్స్!
X
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఆర్థిక రంగంతో పాటు సినిమా రంగం కూడా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఫస్ట్ నుండి మన దేశం లాక్‌డౌన్ నుంచి బయటపడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ లాక్‌డౌన్ దేశంలోని వ్యాపారాలు సినిమా షూటింగులనే కాదు జరగాల్సిన ఎన్నో వివాహాలను కూడా ఆపేసింది. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ లాక్ డౌన్ కారణంగా హీరో నితిన్ పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత హీరో నిఖిల్ సిద్దార్థ్ పెళ్లి కూడా వాయిదా పడింది. ఇక దేశం మొత్తం కరోనాతో బయట పడటానికి ట్రై చేస్తున్న టైమ్‌లో నిర్మాత దిల్ రాజు సడన్ గా పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చాడు. ఇక దిల్ రాజును చూసి పెళ్లిళ్లు ఆగిపోయిన యంగ్ హీరోలంతా మళ్లీ పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయానికి వస్తున్నట్లు సమాచారం.

అయితే లాక్ డౌన్ టైంలో ఏ కరోనా నా పెళ్లిని ఆపలేదు. గుడిలో అయినా నా పెళ్లి అతి సామాన్యంగా చేసుకుంటానని చెప్పాడు హీరో నిఖిల్. ఆ తర్వాత మళ్లీ అలోచించి అందరి సమక్షంలో చేసుకోవాలనే నిర్ణయంతో తన పెళ్లి వాయిదా వేసుకున్నాడు. నిఖిల్‌.. పల్లవి వర్మ అనే డాక్టర్‌ను ప్రేమించి నిశ్చితార్థం కూడా చేస్తున్నాడు. అదే రోజు ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో రింగులు కూడా మార్చుకున్నారు. అయితే ముందుగా వీరి పెళ్లి ఏప్రిల్ 16న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. ఇటీవల లాక్‌డౌన్ కారణంగా వీరిద్దరు మే 14న చేసుకుంటామని తెలిపారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ 17 వరకు కొనసాగుతుంది. దీంతో మళ్లీ పెళ్లిని వాయిదా వేసే ఆలోచన మానేసి.. పరిస్థితులకు అనుగుణంగా నిర్మాత దిల్ రాజు లాగా పెళ్లి చేసేసుకుందామని నిర్ణయించుకున్నాడట. అందుకే ముందుగా 14న.. అంటే రేపు నిర్ణయించిన ఉదయం 6:31 గంటల సుముహూర్తానికే కుటుంబ పెద్దలు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. మరి కొన్ని గంటల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.