Begin typing your search above and press return to search.
ఫియాన్సీ ని గుర్తు చేసుకుంటున్న నిఖిల్!
By: Tupaki Desk | 28 April 2020 2:20 PM ISTవిభిన్నమైన కథలు ఎంచుకుని ప్రేక్షకులను మెప్పిస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్. పోయినేడాది 'అర్జున్ సురవరం' సినిమాతో హిట్ కొట్టి ఫాం లోకి వచ్చిన నిఖిల్ ఫిబ్రవరిలో తను ఒక ఇంటివాడిని కాబోతున్న విషయం ప్రకటించాడు. డా.పల్లవి వర్మ తో నిఖిల్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. నిజానికి ఏప్రిల్ 16 న నిఖిల్-పల్లవి వివాహానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు కానీ అది ఈ కరోనా క్రైసిస్ కారణంగా వాయిదా పడింది.
ఇదిలా ఉంటే నిఖిల్ తన ఇన్స్టా ఖాతా ద్వారా తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసి "మనం త్వరలో ఒకటి కాబోతున్నాం. ఇప్పటికి మాత్రం దూరం నుంచే ప్రేమిస్తూ ఉంటా" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఫోటోలో నిఖిల్.. పల్లవి ఇద్దరూ ఒక బీచ్ ఒడ్డున నిలుచుని ఫోటోకు పోజిచ్చారు. ఇద్దరూ సూపర్ స్టైలిష్ గా.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ తరహాలో కనిపిస్తున్నారు. ఈ కరోనా లేకపోతే ఈ జంట పెళ్లి ఇప్పటికే అయిపోయి ఉండేది. అయినా ఎన్నో గ్రహాలు ఉండగా ఆ కరోనా మహమ్మారికి ఈ భూమే దొరికిందా..? సాధారణంగా పెళ్లికి ఒక్కోసారి విలన్లు ఉంటారు.. కానీ నిఖిల్ - పల్లవి మ్యారేజ్ కు మాత్రం కరోనా టెంపరరీ విలన్ గా మారడం బాధాకరమే.
ఏదేమైనా ఈ నిఖిల్ ఫోటోకు నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది. నైస్ కపుల్ అంటూ కొందరు మెచ్చుకున్నారు. ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా 2014 లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన 'కార్తికేయ' సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది.