Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్​కు హీరో నిఖిల్ క్షమాపణలు

By:  Tupaki Desk   |   5 July 2023 4:33 PM IST
ఫ్యాన్స్​కు హీరో నిఖిల్ క్షమాపణలు
X
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ​ 'స్పై'. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కిన విషయం తెలిసిందే. టాక్​, రివ్యూస్ పక్కనపెడితే మొదటి రోజే ఈ చిత్రం రూ.11 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టు మూవీటీమ్​ అధికారికంగా ప్రకటించింది. కానీ ఈ కథన అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా రెండో రోజు నుంచి డీలా పడిపోయింది.

ఈ క్రమంలో నిఖల్​.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు, తన అభిమానులకు క్షమాపణలు తెలిపారు. సోషల్​మీడియాలో ఓ లాంగ్​ నోట్​ను రిలీజ్ చేసి తన బాధను వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సినిమా అన్ని భాషల్లో రిలీజ్ కాకపోవడంపై కూడా మాట్లాడారు. అందుకు తాను చింతిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇకపై అలా జరగకుండా ఉండేలా చూసుకుంటానని వెల్లడించారు.

"నా కెరీర్‌లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక ఓపెనింగ్స్‌ను అందించినందుకు ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. నాపై మీరు ఇంత నమ్మకం ఉంచినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాంట్రాక్ట్/కంటెంట్ డీలే సమస్యల కారణంగా.. దేశవ్యాప్తంగా అన్నీ భాషల్లో సినిమాను ​ విడుదల చేయలేకపోయాం. అది నాకెంతో బాధనిచ్చింది. ఓవర్సీస్​లోనూ 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి.

హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. తర్వాత రాబోయే 3 చిత్రాలు అన్ని భాషల్లో థియేటర్లలో పర్ఫెక్ట్‌గా, అనుకున్న సమయానికి రిలీజ్ అవుతాయని మాట ఇస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన ప్రతి తెలుగు సినీ ప్రేమికుడికి కూడా మాట ఇస్తున్నాను. ఇక నుంచి నాణ్యత విషయంలో అస్సలు రాజీపడను. అదీ ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా. ఓ మంచి క్వాలిటీ సినిమాను మీకు అందిస్తాను" అని నిఖిల్​ అన్నారు.

ఇకపోతే ఈ సినిమా నిఖిల్ నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం. ఎడిటర్‌ గ్యారీ బిహెచ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. కె.రాజ శేఖర్‌ రెడ్డి నిర్మించారు. ఐశ్వర్య మేనన్‌ కథానాయికగా నటించింది. శ్రీచరణ్‌ పాకాల స్వరాలందించారు.

జూలియన్‌ ఎస్ట్రాడా ఛాయాగ్రాహకుడు. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా రూపొందిందీ సినిమా అని మూవీటీమ్​ చెప్పింది. కానీ రిలీజ్ అయ్యాక ఆ అంశం కనిపించలేదని ప్రేక్షకులు అన్నారు.