Begin typing your search above and press return to search.

కల నిజమాయెగా.. నాని కోరిక తీరెగా

By:  Tupaki Desk   |   8 Oct 2015 11:34 AM IST
కల నిజమాయెగా.. నాని కోరిక తీరెగా
X
మణిరత్నం దర్శకత్వంలో నటించడం.. ఇది న్యాచురల్ స్టార్ నాని కల, కోరిక, ఇష్టం ఎక్సెట్రా వగైరా. ఇవన్నీ నానియే స్వయంగా చెప్పాడు. ఆయన మీద ఉన్న ఇష్టంతో.. ఓకే బంగారం మూవీలో దుల్కర్ సల్మాన్ కి తెలుగు డబ్బింగ్ కూడా చెప్పాడు నాని. కానీ ఇప్పుడు నాని స్టేజ్ మారిపోయింది. భలేభలే మగాడివోయ్ తర్వాత.. అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి నానిని.

మారుతి డైరెక్షన్ లో వచ్చిన భలే మగాడు నాని ఎదురుచూసిన హిట్ మాత్రమే కాదు.. లో, మీడియం బడ్జెట్ మూవీలకు ఓ బెంచ్ మార్క్ లా మారిపోయింది. పాతిక కోట్ల షేర్ టార్గెట్ సెట్ చేశాడు నాని. ఇంత సాధించడంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి న్యాచురల్ స్టార్ కి. అయితే.. తాను మాత్రం గతంలో చేసినట్లుగా పాత్రల ఎంపికలో ఏమాత్రం తప్పటడుగులు వేయడం లేదు.

మాస్ అప్పీల్ ఉన్న పాత్రలతో కెరీర్ నే ప్రమాదంలో పడేసుకున్నాడు నాని గతంలో. ఇప్పుడా మిస్టేక్ చేయడం లేదు. తాను కరెక్ట్ గా సూటయ్యే పాత్రలనే ఎంచుకోవాలని భావిస్తున్న సమయంలో.. నానికి మణిరత్నం మూవీలో ఆఫర్ వచ్చింది. గతంలో ఓకే బంగారానికి అడగ్గానే డబ్బింగ్ చెప్పాడనే కృతజ్ఞత ఉండడం, ఇప్పుడు లవర్ బోయ్ పాత్రలకు నాని రోల్ మోడల్ అయిపోవడంతో.. మణిరత్నం కూడా నాని వైపే మొగ్గు చూపాడు. తెలుగు, తమిళ్ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడని తెలుస్తోంది.