Begin typing your search above and press return to search.

మళ్లీ నిర్మాత అవతారంలో..

By:  Tupaki Desk   |   29 Aug 2017 11:37 AM IST
మళ్లీ నిర్మాత అవతారంలో..
X
హీరోగా కెరీర్ లోనే బెస్ట్ స్టేజ్ లో ఉన్నాడు యంగ్ హీరో నాని. ఈ న్యాచురల్ స్టార్ ఉన్నాడంటేనే.. వసూళ్లు వరదలా వచ్చేస్తున్నాయి. సినిమా ఏ జోనర్ లో ఉన్నా.. కలెక్షన్స్ మాత్రం అన్ని ఏరియాల నుంచి విపరీతంగా వస్తూండడం మరీ ఆశ్చర్యం కలిగించే విషయం. ఇటు హీరోగా కంటిన్యూ అవుతూనే.. మరోవైపు ప్రొడ్యూసర్ గా కూడా అఫ్పుడప్పుడూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు నాని.

గతంలో డీ ఫర్ దోపిడీ అంటూ సిరాజ్ కల్లా దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించాడు నాని. ఇప్పుడు మరోసారి నిర్మాత అవతారం ఎత్తబోతున్నాడు. రీసెంట్ గా ప్రశాంత్ అనే కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీ నానికి విపరీతంగా నచ్చేసిందట. ఆ కథను సినిమాగా మలిచేందుకు నాని రెడీ అయిపోతున్నట్లు తెలుస్తోంది. ఫీచర్ ఫిలిమ్స్ కు ఈ ప్రశాంత్ కొత్తే అయినా.. గతంలో షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవం ఉంది. డైలాగ్ ఇన్ ద డార్క్ అంటూ.. దేశంలో వర్చువల్ ఆడియో టెక్నాలజీతో మొదటగా ఫిలిం తీసినది ఇతనే. ఈ ప్రశాంత్ చెప్పిన కథకు ముగ్ధుడైన నాని.. తనే నిర్మాతగా మూవీ తీసేందుకు సిద్ధమయ్యాడట.

అయితే.. ఈ సినిమా నిర్మాణం వెంటనే ప్రారంభమైపోయే అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. నెరేషన్ లో ఉన్న కొన్ని లోటుపాట్లను సవరించే పనిలో ఉన్నారట. స్క్రిప్ట్ లో ఉన్న చిన్నపాటి లోపాలను కూడా సెట్ చేస్తున్నారట. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రావడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.