Begin typing your search above and press return to search.

అంటే.. అన్ని సినిమాలను అలా చూడవద్దు ప్లీజ్

By:  Tupaki Desk   |   14 Jun 2022 6:00 AM GMT
అంటే.. అన్ని సినిమాలను అలా చూడవద్దు ప్లీజ్
X
నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికి భారీ అంచనాల మధ్య రిలీజై మిశ్రమ ఫలితాలు అందుకుంటోంది. నాని ఫ్యాన్స్ను ఈ సినిమా నిరాశపరిచినట్లే కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. నాని యాక్టింగ్కి ఎదురు లేకపోయినా.. సినిమాలో ల్యాగ్ ఎక్కువగా ఉందని.. కొన్ని సీన్లను కత్తిరిస్తే బాగుండేదని అభిప్రాయం వెలువడుతోంది. ఈ నేపథ్యంలో అంటే సుందరానికి టీం సక్సెస్ మీట్ పెట్టడం చర్చనీయాంశమైంది. సినిమా ఫ్లాప్ అయినా సక్సెస్ మీట్లు ఏంట్రా బాబు అంటోన్న కొందరికి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

జూన్ 10న విడుదలైన అంటే సుందరానికి సినిమా సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. నేచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుని అభిమానులను నిరాశపరిచింది. అయినా.. ఈ సినిమాకు సక్సెస్ మీట్ పెట్టడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఫ్లాప్ సినిమా కు సెలబ్రేషన్స్ ఏంటని విస్తుపోతున్నారు. ఈ క్రమంలో సక్సెస్ మీట్లో హీరో నాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"అంటే సుందరానికి టీమ్ అందరికీ థాంక్స్. అందరం కలిసి ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ క్రియేట్ చేయగలిగినందుకు. అందరు అంటున్నారు మూడు రోజులకే సక్సెస్ సెలబ్రేషన్స్ ఏంటి అని.. ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటుంది నంబర్స్ను కాదు, హార్ట్స్ను.. మా సినిమాకి ఎంత ప్రేమ దక్కింది, చూసిన వాళ్లు ఎంత బాగా ఎంజాయ్ చేశారు అనే దాన్ని మేం వేడుక జరుపుకుంటున్నాం.

బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అవునా కాదా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ సినిమా చూసిన వారి కళ్లలో ఆనందం చూస్తూంటే మేము ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేశాం అనిపిస్తోంది. మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అందులో 'అంటే సుందరానికి' ఒకటి" అని చెప్పుకుంటూ వచ్చారు నాని.

"ఈ సందర్భంగా మీడియా మిత్రులకు, సోషల్ మీడియా వారియర్స్కు ఒక విషయం చెప్తున్నాను. కొత్తగా ట్రై చేసినప్పుడు ఒక మాస్ మూవీ తో కంపేర్ చేయడం, కలెక్షన్స్ ఎందుకు రాలేదు అని అడగడం కాదు. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు వారి భుజాల మీద ఎత్తుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగు లో మనం అందరం భాగం అవుతాం. ఇది అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా. ఇది మన విజయం.

రేపు ఈ సినిమా ఎక్కడికి వెళ్తోంది. బాక్సాఫీస్ను రీచ్ అవుతుందా లేదు అనేది ప్రేక్షకులకు వదిలేస్తున్నాం. ఒక పదేళ్ల తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే నా కెరీర్లో గొప్ప సినిమాల్లో అంటే సుందరానికీ ఒకటి ఉంటుంది అని నేను గర్వంగా చెప్పుకోగలను. ఇలాంటి కథలు చెప్పడానికి గట్స్ కావాలి. అవి మా డైరెక్టర్ వివేక్లో ఉన్నాయి. ఇది ఆవకాయ లాంటి సినిమా. రోజు రోజుకు ఈ సినిమా ఊరుతుంది” అన్నారు నాని. నాని కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. "అంటే సుందరానికీ… మాకు గొప్ప అనుభూతినిచ్చిన చిత్రం. మా బ్యానర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం. ఇదో క్లాసిక్. ఈ సినిమా తీసినందుకు నిర్మాతలుగా మేము చాలా గర్వంగా ఫీలవుతున్నాం"అని అన్నారు.