Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: ఇది నాని వేసుకునే జెర్సీ

By:  Tupaki Desk   |   15 Jun 2018 8:12 AM GMT
ఫస్ట్ లుక్: ఇది నాని వేసుకునే జెర్సీ
X
న్యాచురల్ స్టార్ నాని తన రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు స్ట్రాంగ్ గా బ్రేక్ వేశాడు అని అర్ధమవుతోంది. రెగ్యులర్ లవ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు కాకుండా కాస్త డిఫరెంట్ రూట్ లో వెళ్లాలని అనుకుంటున్నాడు. అందుకోసం యువ దర్శకుల కథలకు ఒకే చెబుతున్నాడు. కృష్ణార్జున యుద్ధం సినిమా మనోడిలో చాలా మార్పులు తెచ్చినట్టుంది. మళ్లీ గతంలో లాగా ప్లాప్ బాట పట్టకుండా హిట్స్ తో వెళ్లాలని అనుకుంటున్నాడు.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఇటీవల నాని మళ్లీ రావా దర్శకుడు గౌతమ్ చెప్పిన ఒక డిఫరెంట్ కథకు ఒకే చెప్పాడు అని న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అలా ఒప్పుకున్నాడో లేదో పోస్ట్ ప్రొడక్షన్ పనుల వేగాన్ని పెంచారు. సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. సినిమా పేరు జెర్సీ అని ఫిక్స్ చేసుకున్నారు. డ్రీమ్ కోసం ఆలస్యం చేయకూడదు అనే తరహాలో మంచి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇండియన్ టీమ్ క్రికెట్ జెర్సీ పోస్టర్ లో కనిపిస్తోంది అంటే నాని బ్యాట్ పట్టనున్నాడు అని అర్ధమవుతోంది.

అర్జున్ పేరుతో ఉన్న జెర్సీ ముందు బ్యాట్ హెల్మెంట్ క్రికెట్ కు సంబంధించినవి కనిపిస్తున్నాయి అంటే ఎదో పెద్ద మ్యాజిక్కే చేస్తున్నాడని టాక్ వస్తోంది. సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న జెర్సీ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాని నాగార్జున తో మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.