Begin typing your search above and press return to search.

టీకా వేయించుకుని బ‌రిలో దిగిన‌ ట‌క్ జ‌గ‌దీష్?

By:  Tupaki Desk   |   27 Jun 2021 5:30 AM GMT
టీకా వేయించుకుని బ‌రిలో దిగిన‌ ట‌క్ జ‌గ‌దీష్?
X
టీకానే ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు శ్రీరామర‌క్ష‌. వ్యాక్సిన్ ప్రాణాపాయాన్ని త‌గ్గిస్తుంద‌ని ఇటీవ‌ల‌ ప్రూవ్ అవుతోంది. వ్యాక్సినేష‌న్ పూర్త‌యిన వాళ్లు వైర‌స్ బారిన ప‌డింది చాలా త‌క్కువ‌. అందుకే వ్యాక్సిన్ పై ప్ర‌భుత్వాలు పెద్ద ఎత్తున ప్ర‌చారం క‌ల్పిస్తున్నాయి. ఇక సెల‌బ్రిటీలు కూడా అంద‌రూ త‌ప్పక వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీకా కార్య‌క్ర‌మం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా నేచుర‌ల్ స్టార్ నాని కూడా వ్యాక్సిన్ వేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. శ‌నివారం నాని వ్యాక్సిన్ వేయించుకున్నారు.

దానికి సంబంధించిన ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి అవెర్ నెస్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసారు. అలాగే నాని అక్క‌డ సిబ్బందిని వ్యాన్సినేష‌న్ ని ఉద్దేశించి కొన్ని శిర్షీక‌లు కూడా జోడించారు. ఏ) మేం టీకాలు వేయిస్తాం.. సుర‌క్షితంగా ఉంటాం. బి) టీకాలు వేయ‌డం ద్వారా కూడా మేము సుర‌క్షితంగా ఉంటాం! అని రెండు ఆప్ష‌న్లు ఇచ్చి వాటిలో ఏదో ఒక దాన్ని మీరు ఎంచుకోండి అని నాని పేర్కొన్నారు. ఆ ర‌కంగా నాని వ్యాక్సినేష‌న్ పై చైత‌న్యం తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసారు.

ఇక నేచుర‌ల్ స్టార్ కెరీర్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం `ట‌క్ జ‌గ‌దీష్` ని రిలీజ్ చేసే ప‌నిలో ఉన్నారు. సెకండ్ వేవ్ కార‌ణంగా రిలీజ్ వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.. అయితే లాక్ డౌన్ నుంచి ఒక్కొక్క‌టిగా మిన‌హాయింపులు వ‌స్తున్న నేప‌థ్యంలో థియేట‌ర్లు తెరుచుకుంటే ట‌క్ జ‌గ‌దీష్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే శ్యాం సింఘ‌రాయ్.. అంటే సుంద‌రానికి అనే రెండు సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. 2021-22 సీజ‌న్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో నాని త‌న అభిమానుల ముందుకు రానున్నారు.