Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ ఒక్కసారి చూస్తే చాలు చేసేస్తాడు

By:  Tupaki Desk   |   6 Feb 2020 11:00 PM IST
ఎన్టీఆర్‌ ఒక్కసారి చూస్తే చాలు చేసేస్తాడు
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో బెస్ట్‌ డాన్సర్‌ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో ముందు వరుసలో ఎన్టీఆర్‌ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎన్టీఆర్‌ గతంలో చాలా బరువు ఉండేవాడు. అప్పుడు కూడా ఆయన స్టెప్పులు చూసి అవాక్కయ్యేలా డాన్స్‌ చేసేవాడు. ఇక ఇప్పుడు ఆయన డాన్స్‌ గురించి అసలు మాటలు చనిపోవు అంటూ అభిమానులు చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. టాలీవుడ్‌ ది బెస్ట్‌ డాన్సర్‌ అంటూ అభిమానులు పిలుచుకునే ఎన్టీఆర్‌ గురించి యంగ్‌ హీరో నందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నందు త్వరలో ‘సవారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా పబ్లిసిటీలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నందు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ డాన్స్‌ గురించి ప్రస్తావించాడు. రభస చిత్రంలోని ఒక పాట చిత్రీకరణ కోసం డాన్సర్స్‌ రోజంతా కూడా రెండున్నర నిమిషాల స్టెప్స్‌ ను ప్రాక్టీస్‌ చేశారు. డాన్సర్స్‌ ప్రాక్టీస్‌ అయిన తర్వాత ఆ డాన్స్‌ ను ఎన్టీఆర్‌ చూసి షాట్‌ కు రెడీ అయ్యాడు. అంత పెద్ద షాట్‌ ఒకే టేక్‌ లో ఓకే అయ్యింది.

డాన్సర్స్‌ అంత సమయం ప్రాక్టీస్‌ చేసిన స్టెప్స్‌ ను ఎన్టీఆర్‌ చూసి వెంటనే వేయడం అందరికి ఆశ్చర్యంగా అనిపించింది. ఆయన బెస్ట్‌ డాన్సర్‌ అనడానికి అంతకు మించిన ఉదాహరణ అక్కర్లేదు అంటూ నందు చెప్పుకొచ్చాడు. ఆయన ఏ స్టెప్‌ ను అయినా ఈజీగా చేసేస్తాడంటూ ఎన్టీఆర్‌ పై నందు ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం నందు వ్యాఖ్యలను ఎన్టీఆర్‌ అభిమానులు తెగ షేర్‌ చేసుకుంటున్నారు.