Begin typing your search above and press return to search.

ఫిజిక్ తో ఫిదా చేస్తున్న కుర్ర హీరో

By:  Tupaki Desk   |   10 May 2023 7:30 PM IST
ఫిజిక్ తో ఫిదా చేస్తున్న కుర్ర హీరో
X
2011లో క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టాడు యువ హీరో నాగశౌర్య. ఆ సినిమా పెద్దగా ఎవరికీ తెలియకపోయినా చందమామ కథలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చి ఊహలు గుసగుసలాడే చిత్రంలో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తనకు సెట్ అయ్యే సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నాడు.

ముఖ్యంగా దిక్కులు చూడకు రామయ్య, కల్యాణ వైభోగమే, ఒక మనసు, ఛలో, ఓ బేబీ, అశ్వథామ, వరుడు కావలెను వంటి చిత్రాల్లోనూ మెరిశాడు. ఎప్పుడూ సినిమాలతో బిజీగా గడిపే ఈ కుర్ర హీరో ఇటీవలే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలో నటించాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించేశాడు. పవన్ బాసంసెట్టి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇంత బిజీగా గడుపుతున్న ఈయన సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు.

తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటాడు. అయితే తాజాగా ఇన్ స్టా వేధికగా ఓ ఫొటోను షేర్ చేశాడు. అందులో అదిరిపోయే లుక్ లో దర్శనం ఇచ్చాడు. బాడీ కనిపించేలా బటన్స్ ఓపెన్ చేసి ఉన్న షర్ట్ వేసుకున్నాడు. సిగరెట్ తాగుతూ గోడ వద్ద నిల్చొని ఫొటోకు ఫోజులు ఇచ్చాడు. అలాగే మరో చేత్తో తన పెట్ డాగ్ ను పట్టుకున్నాడు.

ఆ కుక్క నాగ శౌర్యను చూస్తుండగా.. నాగశౌర్య మాత్రం అటెటో చూస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఈ ఫొటో షేర్ చేయడానికి ఓ సందర్భం ఉంది లెండి. ఆయన పెట్ డాగ్ తన వద్దకు నాలుగేళ్లు అవుతుందట. ఈరోజు దాని పుట్టిన రోజు అంట. అందుకే హ్యాపీ బర్త్ బూ బాయ్ అంటూ రాసుకొచ్చాడు. " ఫోర్ ఇయర్స్ ఆఫ్ శీర్ జాయ్ ఇన్ టు మై లైఫ్, హ్యాపీయెస్ట్ బర్త్ డే బూ బాయ్" అంటూ రాసి హార్ట్ సింబల్స్ పెట్టాడు.

బ్లాక్ డాగ్ తో వైట్ అండ్ వైట్ లో నాగశౌర్య ఇచ్చిన ఫోజు నిజంగానే అదిరిపోయింది. ఈ ఫొటో చూసిన ప్రతీ ఒక్కరూ లుక్ అదిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు. హ్యాపీ బర్త్ డే అంటూ ఆయన పెట్ కు చెబుతున్నారు. అయితే నాగశౌర్య గతేడాది నవంబర్ లోనే బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకున్నాడు. ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టిని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం హ్యాపీగా గడుపుతున్నాడు.