Begin typing your search above and press return to search.

హీరో నాగ శౌర్య మేనత్త స్టార్ నటి.. కానీ మాట్లాడుకోరు ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   2 Feb 2023 11:30 AM IST
హీరో నాగ శౌర్య మేనత్త స్టార్ నటి.. కానీ మాట్లాడుకోరు ఎందుకో తెలుసా?
X
టాలీవుడ్‌ యంగ్ హీరో నాగ శౌర్య బ్యాచిలర్ లైఫ్‌ కు ఇటీవలే గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. నాగ శౌర్య బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొద్ది మంది అతిథులు సమక్షంలో వీరి వివాహా వేడుక జరిగింది. ఇక ఇండస్ట్రీలో హ్యాండ్సమ్‌ హీరోల లిస్ట్ తీస్తే.. అందులో ముందు వరసలో నాగ శౌర్య ఉంటారు.

అయితే నాగశార్య పేరెంట్స్... సినిమా ఇండస్ట్రీలో సాగుతున్నారు. ఇక ఈయన మేనత్త కూడా యాక్టర్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఆమె చాలా కాలంగా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఆమె పేరు లత శ్రీ. నాగశౌర్య తండ్రికి ఈమె సొంత చెల్లెలు. ‘యమలీల’ చిత్రంలోని ‘అభివందనం యమరాజా..’ అంటూ సాగే పాటలో ఈమె స్టెప్పులు వేసి అలరించింది. ఆ ఒక్కటీ అడక్కు, నెంబర్ వన్, జంపలకిడి పంబ.. వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. పలు దక్షిణాది భాషల్లో సుమారు 70 కిపైగా సినిమాల్లో నటించిన ఈమెను... జిమ్ ట్రైనర్‌ ను ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీలత... 2007లో ఈవీవీ తీసిన ‘అత్తిలి సత్తిబాబు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

అయితే శ్రీలత ఫ్యామిలీ కి... నాగ శౌర్య ఫ్యామిలీకి మధ్య మాటలు లేవట. ఇరు ఫ్యామిలీల్లో చిన్న చిన్న గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి కారణం ఏంటనేది స్పష్టంగా తెలియదు. ఇటీవల నాగశౌర్య వివాహ వేడుకలో కూడా ఈమె కనిపించలేదు. అయితే ఈమెకు అల్లుడు నాగశౌర్య అంటే చాలా ఇష్టమట. ఆయన సినిమాలు కూడా చూస్తుందట.

ఇక ప్రస్తుతం నాగ శౌర్య ఫలనా అబ్బాయి, ఫలానా అమ్మాయి, నారీ నారీ నడుమ మురారీ, పోలీస్ వారి హెచ్చరిక సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. పెళ్లి తర్వాత అయిన ఈ యంగ్ హీరో హిట్ కొడతాడో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.