Begin typing your search above and press return to search.

తిరుమ‌లేశుడి స‌న్నిధిలో `హీరో` టీమ్ హ‌ల్ చ‌ల్‌

By:  Tupaki Desk   |   12 Jan 2022 5:39 AM GMT
తిరుమ‌లేశుడి స‌న్నిధిలో `హీరో` టీమ్ హ‌ల్ చ‌ల్‌
X
ఇండ‌స్ట్రీలో వార‌సుల హంగామా న‌డుస్తోంది. హీరోలు వార‌సుల నుంచి డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ ల వార‌సులు హీరోలుగా తెరంగేట్రం చేస్తూ క్రేజీ హీరోలుగా పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. కొంత మంది స‌క్సెస్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తుంటే మ‌రి కొంత మంది ఇప్ప‌టికే హీరోలుగా స‌క్సెస్ సాధించి త‌మ‌దైన మార్కు చిత్రాల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. తాజాగా సూప‌ర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మ‌రో వార‌సుడు తెరంగేట్రం చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే వీరి ఫ్యామిలీ నుంచి ప‌రిచ‌య‌మైన సుధీర్ బాబు హీరోగా నిల‌దొక్కుకుని విజ‌యాల బాట ప‌ట్ట‌గా ఇదే ఫ్యామిలీ నుంచి మ‌రో వార‌సుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అ1త‌నే గ‌ల్లా అశోక్‌. సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌న‌వ‌డు, స్టార్ హీరో మ‌హేష్ మేన‌ల్లుడు, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు అయిన గ‌ల్లా అశోక్ `హీరో` మూవీతో ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది.

సూప‌ర్ స్టార్ కృష్ణ‌, గ‌ల్ల అరుణ కుమారి స‌మ‌ర్ప‌ణ‌లో అమ‌ర్ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై శ్రీ‌మ‌తి గ‌ల్లా ప‌ద్మావతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త త‌ర‌హా క‌థ‌గా రూపొందిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి జ‌న‌వ‌రి 15న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. సూప‌ర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న వార‌సుడి చిత్రం కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో చిత్ర బృందం గ‌త కొన్ని రోజులుగా ప్ర‌మోష‌న్స్ తో య‌మ బిజీగా గ‌డిపేస్తోంది. తొలి చిత్రం కావ‌డంతో చిత్ర బృందం తిరుమ‌లేశుడిని బుధ‌వారం ప్ర‌త్యేకంగా ద‌ర్శించుకుంది. ఈ సంద‌ర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం ప్ర‌త్యేకంగా తిరుప‌తి వెళ్లిన చిత్ర బృందం స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య‌, హీరో గ‌ల్లా అశోక్‌, హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ ల‌తో పాటు గుంటూరు ఎంపీ, హీరో గ‌ల్లా అశోక్ ఫాద‌ర్ గ‌ల్లా జ‌య‌దేవ్, ఆయ‌న స‌తీమ‌ణి, మ‌హేష్‌బాబు సోద‌రి గ‌ల్లా ప‌ద్మావ‌తి కూడా చిత్ర బృందంతో క‌లిసి స్వామివారిని ద‌ర్శంచుకున్నారు. సంప్ర‌దాయ స్వామి వారిని ద‌ర్శించుకున్న త‌రువాత గ‌ల్లా జ‌య‌దేవ్ మీడియాతో ముచ్చ‌టించారు. ఇందుకు సంబంధించిన స్టిల్స్ ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తున్నాయి.