Begin typing your search above and press return to search.
విజయ నిర్మల మృతికి అసలుకారణం చెప్పిన కృష్ణ
By: Tupaki Desk | 8 July 2019 5:58 PM ISTనటి దర్శకురాలైన విజయ నిర్మల మృతితో తెలుగు పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగింది. సూపర్ స్టార్ కృష్ణ తో ఆమెకున్న 50 ఏళ్ల బంధం చాలా గొప్పదిగా చెప్పుకోవాలి. 50 ఏళ్ల క్రితం ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుండి కూడా చాలా అన్యోన్యంగా ఎంతో మంది సెలబ్రెటీలకు ఆదర్శంగా నిలుస్తూ వచ్చారు. తాజాగా విజయ నిర్మల మృతితో కృష్ణ ఒంటరి అయ్యారు. ఆమె మృత దేహం వద్ద కృష్ణ కన్నీరు పెట్టుకోవడం అందరిని కలచి వేసింది. భార్య మరణం నుండి మెల్లగా బయట పడుతున్న కృష్ణ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ ఇంటర్వ్యూలో ఆరోజు రాత్రి అసలేం జరిగిందనే విషయంపై అన్ని అనుమానాలకు క్లారిటీ ఇచ్చారు. విజయ నిర్మల గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న విషయం నిజమే కాని ఆమె హఠాత్తుగా చనిపోవడంకు కారణం మాత్రం ఆమె బెడ్ మీద నుండి కింద పడటమే అంటూ కృష్ణ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి సమయంలో చాలా సేపు మాట్లాడుకున్నాం. అప్పుడే నేను రెస్ట్ రూంకు వెళ్లాను. నేను అలా లోనికి వెళ్లగానే దబ్ అంటూ పెద్ద శబ్దం వచ్చింది. నేను బయటకు వచ్చి చూసేప్పటికి కింద పడ్డ విజయ నిర్మల కప్ బోర్డ్ ను పట్టుకుని పైకి లేచేందుకు ప్రయత్నిస్తుంది. చాలా కాలంగా మెడ నరం సన్నబడటంతో ఇబ్బంది ఎదుర్కొంటుంది. కప్ బోర్డ్ ను పట్టుకుని పైకి లేస్తున్న సమయంలో ఆమె మెడలో ఇబ్బంది పెడుతున్న నరకంకు బలంగా తలిగింది.
హాస్పిటల్ కు తీసుకు వెళ్తే దెబ్బ తలిగిన చోట ప్లాస్టర్ వేసి పంపిస్తారని అనుకున్నాను. రాత్రి 11 గంటల సమయంలో ఆమె ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. సీరియస్ గా ఆమె పరిస్థితి ఉందని చెప్పారు. మరి కాసేపటికి రాత్రి పదకొండున్నర సమయంలో ఆమె చనిపోయారంటూ చెప్పారు. ఆరోగ్యంతో ఇంటికి వస్తుందని భావించాను. కాని నన్ను విడిచి వెళ్లి పోయిందని కృష్ణ కన్నీరు పెట్టుకున్నారు.