Begin typing your search above and press return to search.

నెంబర్ల సినిమాల మీదే హీరో ఫ్యూచర్!

By:  Tupaki Desk   |   9 July 2019 5:41 AM GMT
నెంబర్ల సినిమాల మీదే హీరో ఫ్యూచర్!
X
ఆరెక్స్ 100 లాంటి సెన్సేషనల్ హిట్ తో వెలుగులోకి వచ్చిన హీరో కార్తికేయకు ఇటీవలే విడుదలైన హిప్పి మాములు షాక్ ఇవ్వలేదు. ఈ ఏడాది వచ్చిన అత్యంత రాడ్ మూవీస్ లో ఒకటిగా పేరు తెచ్చుకునేందుకు పోటీ పడింది. తన స్థాయికి మించి లవర్ బాయ్ ఇమేజ్ ని ఊహించుకుని కార్తికేయ వేసిన తప్పటడుగు ఎక్కువ మూల్యాన్నే చెల్లించుకునేలా చేసింది. ఇప్పుడు ఇతని భవిష్యత్తు హీరోగా చేస్తున్న రెండు సినిమాల మీద ఆధారపడి ఉంది.

ఆగస్ట్ 2న విడుదల కానున్న గుణ 369 మీద ఇతగాడు గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు. బోయపాటి శీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన లవ్ స్టోరీగా టాక్ ఉంది. కార్తికేయ లుక్స్ కూడా దానికి తగ్గితే మాస్ అప్పీల్ తో ఉన్నాయి. దీని తర్వాత వచ్చే సినిమా 90 ఎంఎల్. కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి డెబ్యూ చేస్తున్న ఈ మూవీ కూడా ఎంటర్ టైన్ మెంట్ ప్లస్ యాక్షన్ లవ్ స్టోరీగా రూపొందుతోందని సమాచారం.

ఒకవేళ గుణ 369 హిట్ అయితే ఓకే. లేదు అంటే ఒత్తిడి 90 ఎంఎల్ మీద అధికంగా ఉంటుంది. ఇవి కాకుండా నాని హీరోగా రూపొందిన గ్యాంగ్ లీడర్ వీటి మధ్యలో వస్తుంది. అందులో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసిన కార్తికేయ ముందుజాగ్రత్తగా విలన్ పాత్రలను ఎంచుకుంటున్నాడనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. గోపి చంద్ తరహాలో ముందు హీరో తర్వాత విలన్ మళ్ళీ హీరో ఇలా ఈ ప్లాన్ తోనే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ అప్పటి పరిస్థితులు ఇప్పటి వాతావరణం వేరు. ఒకటో రెండో సినిమాలు తేడా కొట్టాయంటే అంతే సంగతులు. మరి రెండు సినిమాల టైటిల్స్ లోనూ నెంబర్లతో వస్తున్న కార్తికేయ లక్ ఎలా ఉందో చూడాలి