Begin typing your search above and press return to search.

భ‌య‌ప‌డితే బ‌ర్త్‌ డే పార్టీలు

By:  Tupaki Desk   |   4 Jan 2019 1:30 AM GMT
భ‌య‌ప‌డితే బ‌ర్త్‌ డే పార్టీలు
X
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ను మ‌బ్బు క‌మ్మేసింది. ఈ మ‌బ్బు కారు మ‌బ్బు. ఆ మ‌బ్బులో ఉన్న అస‌లు సిస‌లు భ‌యంక‌ర నిజం ఏంటో తెలుసుకోవాల్సిన స‌మ‌యం సంద‌ర్భ ం వ‌చ్చేసింది. ఇన్నాళ్లు ఇక్కడ మ‌సిపూసి మారేడు కాయ‌ను చేసే భ‌జంత్రి జ‌నాల గురించి.. పైన ప‌టారం లోన లొటారం బ్యాచ్ గురించి బ‌య‌ట స‌రిగా చెప్పుకున్న‌ది లేదు. ఈ ప‌ర్య‌వ‌సానం ప‌రిశ్ర‌మ‌కు కొత్త‌గా వ‌చ్చే నిర్మాత‌ల‌కు, అలాగే పంపిణీదారులు, బ‌య్య‌ర్ల‌కు పుట్టి ముంచడం చూస్తున్న‌దే. కొన్ని క‌ఠోర నిజాలు తెలిస్తే అస‌లు ఇక్క‌డ అప్పులు ఇచ్చేవాళ్లు ఇవ్వ‌రు. అలాంటి వాళ్ల వెంట వెళ్లేందుకు ముందుకు రార‌న్న మాటా వినిపిస్తోంది.

గ‌త కొంత‌కాలంగా ఓ యువ‌హీరో గురించి సాగిస్తున్న భ‌జంత్రి ప్ర‌చారం, అన‌వ‌స‌ర ప‌బ్లిసిటీ హంగామా గురించి చాలా మంది పంపిణీదారులు, బ‌య్య‌ర్ల‌ను ముంచేయడంపైనా, అలాగే అప్పులు ఇచ్చి పంగ‌నామాలు పెట్టించుకున్న ఫైనాన్షియ‌ర్ల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌తిసారీ బ‌ర్త్ డే పార్టీలు, సినిమా గోల్ మాల్ ఫంక్ష‌న్లు అంటూ స‌ద‌రు హీరోని జ‌నం నెత్తిన రుద్దాల‌ని చూసినా జ‌న‌మే ప‌ట్టించుకోక‌పోవ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

అస‌లు త‌నకు మార్కెట్లో ఉన్న సీనెంత‌? అన్న‌ది చూడ‌కుండా అడ్డ‌గోలుగా బ‌డ్జెట్లు పెట్టించి, నిర్మాత‌ల్ని, ఫైనాన్షియ‌ర్ల‌ను ముంచి సాగించిన కొన్ని సంగతుల‌పైనా ఫిలింన‌గ‌ర్ లో ఆస‌క్తిక‌ర డిబేట్ ర‌న్ అవుతోంది. ఇది క‌చ్ఛితంగా ఒక‌రి కోసం వంద‌మందిని ముంచ‌డ‌మేన‌న్న మాటా వినిపిస్తోంది. ఇక మాస్ యాక్ష‌న్ హీరోగా త‌న‌ని తాను నిరూపించుకునేందుకు స‌ద‌రు హీరో ప్ర‌యాస ప‌డ‌డం పైనా ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ నిరంత‌రాయంగా సాగుతూనే ఉంది. అయితే త‌న స్థాయికి త‌గ్గ‌ట్టు బ‌డ్జెట్లు అదుపు త‌గ్గ‌కుండా ప్ర‌య‌త్నిస్తే .. త‌న ప్ర‌తిభ‌కు మెరుగుల‌ద్దేందుకు ఆస్కారం ఉండేది.

కేవ‌లం అతిగా ఆశించి మాస్ లో బిగ్ స్టార్ అయిపోవాల‌ని క‌ల‌లు గ‌న‌డం త‌న‌ను ముంచుతోంద‌న్న మాటా వినిపిస్తోంది. చివ‌రికి త‌న‌తో సినిమా తీసిన స్టార్ డైరెక్ట‌రే .. హీరోల‌కు ఫెయిల్యూర్స్ కామ‌న్ అని ప‌బ్లిక్ ప్లాట్ ఫామ్‌ పై స‌ర్ధి చెప్పాల్సి వ‌చ్చిందంటే అది ఎంత‌టి ప‌రాభ‌వ స్థాయికి చేరిపోయిందో.. అన్న మాటా వినిపిస్తోంది. ఇక ఈ ప‌రాభ‌వ భ‌యాన్ని క‌ప్పి పుచ్చుకునేందుకు బ‌ర్త్ డే పార్టీలు చేసినంత మాత్రాన ఏం ఉప‌యోగం? ఆద‌రించాల్సిన జ‌నం ఆద‌రించాలి క‌దా? అన్న మాటా వినిపిస్తోంది. ఈ భ్ర‌మ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డి వాస్త‌వంలో జీవిస్తే మంచిది అన్న సూచ‌నా ప‌లువురు చేస్తున్నారు.