Begin typing your search above and press return to search.

రోడ్లపై తిరుగుతూ వాల్‌ పోస్టర్స్ అతికించిన హీరో హీరోయిన్‌

By:  Tupaki Desk   |   17 Nov 2021 8:59 AM IST
రోడ్లపై తిరుగుతూ వాల్‌ పోస్టర్స్ అతికించిన హీరో హీరోయిన్‌
X
ప్రస్తుత కాలంలో సినిమా తీయడం పెద్ద కష్టం ఏమీ కాదు.. కాని దాన్ని జనాల్లోకి తీసుకు వెళ్లడం చాలా పెద్ద టాస్క్ అయ్యింది. లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా కూడా పబ్లిసిటీ కొన్ని సార్లు దక్కడం లేదు. అందుకే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేలా ఏదైనా పని చేసి సినిమా గురించి పబ్లిసిటీ చేయాలి.. లేదంటే ఏదైనా వివాదంను రాజేసి సినిమా గురించి మీడియాలో వార్తలు వచ్చేలా చేయాలి.

చిన్న హీరోలు.. కొత్త హీరోలు నటించే సినిమాలకు ఇలాంటి జిమ్మిక్కులు ఏవో చేసి పబ్లిసిటీ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు రామ్ అసుర్‌ అనే సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు చిత్ర యూనిట్ సభ్యులు విభిన్నమైన మార్గంను ఎంచుకుంది. వారు ఎంచుకున్న మార్గం సఫలం అవ్వడంతో ఇప్పుడు మనం ఆ విషయం గురించి చర్చించుకుంటున్నాం..

ఇంతకు వారు చేసిన ప్రయత్నం ఏంటీ అంటే.. సినిమా హీరో హీరోయిన్ లు అయిన అభినవ్ సర్దార్‌ మరియు ఛాందినిలు రోడ్ల మీదకు వచ్చి సినిమా వాల్ పోస్టర్ లను తమ చేతులతో అతికిస్తున్నారు. రద్దీగా ఉన్న ఏరియాల్లో కూడా వీరిద్దరు కలిసి వాల్‌ పోస్టర్ లను అతికించారు.

కనిపించిన వారికి తమ సినిమా మంచి కంటెంట్ తో తెరకెక్కింది. తప్పకుండా ఒక మంచి సినిమా చూశామనే ఫీల్ కలుగుతుంది. కనుక మీరు తప్పకుండా చూడండి అంటూ తెలియజేస్తున్నారు. ఈ తరహా పబ్లిసిటీ ఇప్పటి వరకు లేదు అంటూ సోషల్ మీడియాలో రామ్‌ అసుర్‌ సినిమా గురించి చర్చిస్తూ పబ్లిసిటీ గురించి మాట్లాడుకుంటున్నారు.

అభినవ్ సర్దార్‌ మరియు ఛాందిని జంటగా నటించిన ఈ సినిమాకు వెంకటేష్‌ త్రిపర్ణ దర్శకత్వం వహించాడు. అభినవ్ సర్దార్‌ మరియు త్రిపర్ణ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ఈనెల 19న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కు బెంగాల్‌ టైగర్ ఫేమ్‌ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించాడు. తప్పకుండా ప్రేక్షలకు మా సినిమా నచ్చుతుంది అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. సినిమా ఫలితం ఏమో కాని వారి పబ్లిసిటీ ఫలితం మాత్రం బాగానే కనిపిస్తుంది. రామ్ అసుర్‌ సినిమా గురించి జనాల్లో చర్చ జరుగుతోంది. సినిమా కూడా సక్సెస్ అవుతుందని మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు.