Begin typing your search above and press return to search.

హీరో గోపీచంద్ 'సీటిమార్' మూవీ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే??

By:  Tupaki Desk   |   27 March 2021 11:01 AM GMT
హీరో గోపీచంద్ సీటిమార్ మూవీ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే??
X
ఈ ఏడాది వేసవి సినిమాల సందడి మాములుగా లేదు. వారానికి మూడు నాలుగు సినిమాలకు తక్కువ సంఖ్యలో రిలీజ్ అవ్వడం లేదు. లాక్డౌన్ తర్వాత మరీ ప్రతి శుక్రవారం విడుదల అవుతున్న సినిమాల సంఖ్య అమాంతం పెరిగింది. అందుకే కొన్ని సినిమాలు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. ఇదివరకే అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' జులై 30న విడుదల కాబోతుందని మేకర్స్ డేట్ ప్రకటించారు. కానీ ఆ రోజు ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా ఖరారు కావడంతో అఖిల్ సినిమాను వాయిదా వేసుకున్నాడు. అలాగే తాజాగా టాల్ హీరో గోపీచంద్ నటించిన 'సీటిమార్' సినిమా వాయిదా వేశారు మేకర్స్. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్.

ఇప్పుడు అదే ఏప్రిల్ 2న కింగ్ నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్', అలాగే తమిళ హీరో కార్తీ నటించిన 'సుల్తాన్' సినిమాలు విడుదల కాబోతుండటంతో సీటిమార్ సినిమాను వాయిదా వేశారు మేకర్స్. ఏదొక డేట్ సోలో సినిమాగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. సీటిమార్ సినిమా డిస్టిబ్యూటర్లు మన సినిమాను వేరే సినిమాలతో క్లాష్ లేకుండా కంఫర్ట్ గా రిలీజ్ చేయాలనీ నిర్మాతపై ఒత్తిడి తెచ్చినట్లు టాక్ నడుస్తుంది. ఆ వెంటనే మేకర్స్ స్పందించి సీటిమార్ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా నటించింది. ఫస్ట్ టైం గోపీచంద్ కెరీర్లో కబడ్డీ నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో గోపి, తమన్నా ఇద్దరూ కబడ్డీ కోచులుగా కనిపించనున్నారు. చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు.