Begin typing your search above and press return to search.

హిట్ కాంబినేష‌న్‌.. హ్యాట్రిక్ కొట్టేనా?

By:  Tupaki Desk   |   24 Dec 2021 3:30 PM GMT
హిట్ కాంబినేష‌న్‌.. హ్యాట్రిక్ కొట్టేనా?
X
కోవిడ్ ప్ర‌భావ‌మో ఏమో గానీ మ‌న టాలీవుడ్ హీరోల్లో మునుపెన్న‌డూ చూడ‌ని మార్పు క‌నిపిస్తోంది. ఏడాదికి ఒక‌టి అర సినిమాలు మాత్ర‌మే చేసే మ‌న వాళ్లు గ‌త ఈ ఏడాది వ‌రుస చిత్రాల్ని అంగీక‌రిస్తూ షాకు లిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి నాని వ‌రకు ప్ర‌తీ హీరో ఈ ఏడాది చేతినిండా సినిమాల‌తో బిజీగానే గ‌డిపేశారు. ఇంకొంత మంది స్టార్ హీరోలు వ‌చ్చే రెండు మూడేళ్ల వ‌ర‌కు వ‌రుస సినిమాల్ని లైన్ లో పెట్టేశారు. తాజాగా ఈ జీబితాలోకి హీరో గోపీచంద్ కూడా చేరిపోయారు.

మారుతి డైరెక్ష‌న్‌లో `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ` మూవీ చేస్తున్న ఆయ‌న తాజాగా త‌న‌కు రెండు హిట్లిచ్చిన శ్రీ‌వాస్ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `ల‌క్ష్యం` వంటి సూప‌ర్ హిట్ ఫిల్మ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అనుష్క హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో గోపీచంద్ కు అన్న‌య్య‌గా జ‌గ‌ప‌తి బాబు న‌టించారు. గోపీచంద్ కెరీర్‌లోనూ చెప్పుకోద‌గ్గ సూప‌ర హిట్ మూవీగా `ల‌క్ష్యం` మూవీ నిలిచింది. ఈ మూవీ త‌రువాత వీరి క‌ల‌యిక‌లో `లౌక్యం` వ‌చ్చింది.

`ల‌క్ష్యం` అంత కాక‌పోయినా మంచి హిట్ గా గోపీచంద్ కు స‌క్సెస్‌ని అందించింది. ఈ సినిమా త‌రువాత క‌లిసి వ‌ర్క్ చేయ‌ని గోపీచంద్ - శ్రీ‌వాస్ ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి క‌లిసి సినిమా చేస్తున్నారు. ఇది గోపీచంద్ న‌టిస్తున్న 30వ సినిమా. భూప‌తి రాజా క‌థ అందించిన ఈ చిత్రాన్ని శుక్ర‌వారం హైద‌రాబాద్ లో లాంఛ‌నంగా ప్రారంభించారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై ఈ మూవీని టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

కోల్‌క‌తా నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ సాగుతుంద‌ని తెలుస్తోంది.భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీతో శ్రీ‌వాస్ - గోపీచంద్ ల కాంబినేష‌న్ సెంటిమెంట్ ప్ర‌కారం హ్యాట్రిక్ హిట్ ని ద‌క్కించుకోవ‌డం ఖాయం అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. గోపీచంద్ తో పాటు శ్రీ‌వాస్ కు కూడా ఈ మూవీ హిట్ కావ‌డం చాలా ముఖ్యం.