Begin typing your search above and press return to search.

టెడ్డీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన హీరో..!

By:  Tupaki Desk   |   23 March 2021 5:00 AM IST
టెడ్డీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన హీరో..!
X
దేశంలో సినిమా థియేటర్లు పూర్తిగా ఓపెన్ అయ్యాక కూడా ప్రేక్షకులు ఇంకా డిజిటల్ ప్లాట్ ఫామ్ లపై దృష్టిపెడుతున్నారు. మరి ఇంతలా ఆకర్షణకు గురవ్వడానికి కారణం.. లాక్డౌన్ సమయంలో ఓటిటిలు జనాలపై ప్రభావం చూపించడమే. కొత్త సినిమాల దగ్గర నుండి ప్రోగ్రాంస్, వెబ్ సిరీస్ ఇలా అన్ని డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుండటంతో జనాలు ఓటిటిలకు అలవాటు పడ్డారు. ఇటీవలే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓటిటి స్ట్రీమింగ్ వైపు జనాలు మళ్లడం కాదు. ఏకంగా సినీతారలే ఓటిటి వైపు మొగ్గుచూపడం జరుగుతుంది. అందులో భాగంగానే థియేటర్స్ తెరుచుకున్నాక కూడా పలు సినిమాలు ఓటిటిలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. అలా విడుదలైన సినిమాలలో తమిళ హీరో ఆర్య నటించిన టెడ్డీ సినిమా ఒకటి.

ఆర్యా మొదటినుండి కూడా ప్రయోగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే హిట్ అయినా ఫెయిల్ అయినా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తెలుగు ఇండస్ట్రీకి వరుడు సినిమాతో పరిచయమయ్యాడు ఆర్యా. విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆర్యా.. రాజారాణి సినిమాతో హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ విధంగా అప్పటినుండి ఆర్యా సినిమాలు తెలుగులోకి డబ్ అవుతున్నాయి. తాజాగా టెడ్డీ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలై మంచి వీక్షణలు పొందింది. అలాగే మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అయితే టెడ్డీ సినిమా ప్రేక్షకులతో పాటు పిల్లలకు బాగా కనెక్ట్ అయింది. తాజాగా ఆర్యా తన ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. టెడ్డీ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమాకు కూడా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహిస్తాడని టాక్.