Begin typing your search above and press return to search.

సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ కొత్త తరహా రచ్చ

By:  Tupaki Desk   |   6 April 2020 9:00 AM IST
సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ కొత్త తరహా రచ్చ
X
ఈమద్య కాలంలో సోషల్‌ మీడియా పరిధి ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా పరిశ్రమకు చెందిన స్టార్స్‌ ఇంకా వారికి సంబంధించిన విషయాలు తెలియజేస్తారని వారి ఫ్యాన్స్‌ ను ఫ్యాన్స్‌ గ్రూప్‌ ను ట్విట్టర్‌ లో ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు. ఆ హీరోల ఫ్యాన్స్‌ ఈమద్య కొత్త తరహాలో రచ్చ చేస్తున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి హీరోకు కూడా కొన్ని గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులు చిల్లర పోస్ట్‌ లు మొదలు పెట్టాయి.

గత కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌ లో ఏదో ఒక సినిమా ఇన్ని సంవత్సరాలు అయ్యింది.. ఈ రోజుకు ఇన్ని ఏళ్లు పూర్తి చేసుకుంది అంటూ ఆ రోజంతా కూడా ట్విట్టర్‌ లో హల్‌ చల్‌ చేస్తూనే ఉన్నారు. అది హిట్‌ మూవీ అయినా ఫ్లాప్‌ మూవీ అయినా కూడా ఈ రోజుకు ఆ సినిమా విడుదలై ఇన్ని సంవత్సరాలు అయ్యింది అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ తో ఓ పోస్ట్‌ పడేస్తున్నారు. దాన్ని ఇతర ఫ్యాన్స్‌ ట్రెండ్‌ చేయడం చేస్తున్నారు.

సరే హిట్‌ అయిన సినిమాలు విడుదలై అయిదేళ్లు అయ్యింది... లేదంటే పదిహేను.. ఇరువై ఏళ్లు అయ్యింది అని పోస్ట్‌ చేస్తే పర్వాలేదు. కాని వాళ్లు ఫ్లాప్‌ సినిమాలకు కూడా సంవత్సరం పూర్తి.. రెండేళ్లు పూర్తి మూడేళ్లు పూర్తి అరు ఏళ్లు పూర్తి 9 ఏళ్లు పూర్తి అంటూ ట్రెండ్‌ చేసేందుకు ప్రయత్నించి ఆ హీరోల పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మొన్న ఆమద్య ఎన్టీఆర్‌ నటించిన శక్తి సినిమా విడుదలై 9 ఏళ్లు అంటూ పోస్టర్‌ ఒకటి డిజైన్‌ చేసి మరీ సోషల్‌ మీడియాలో 9 ఇయర్స్‌ ఫర్‌ శక్తి అంటూ పోస్ట్‌ చేశారు. ఆ సినిమా ఎంతటి ఫ్లాప్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సినిమాలను ఎప్పటికప్పుడు మర్చి పోతేనే బెటర్‌. కాని ఫ్యాన్స్‌ వాటిని మళ్లీ గుర్తు చేయడంపై కొందరు ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమాలు మళ్లీ తెరపైకి తీసుకు వచ్చి హీరోను చులకన చేయడమే అంటున్నారు.

కేవలం శక్తి అనే కాదు ఇంకా చాలా సినిమాలకు ఈమద్య ఇలాగే రీ పబ్లిసిటీ చేస్తూ ఆయా హీరోల ఫ్యాన్స్‌ కు చిరాకు తెప్పించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఏదో ఒక విషయాన్ని తమ హీరో గురించి ట్రెండ్‌ చేయాలనే ఉద్దేశ్యంతో కొందరు ఫ్యాన్స్‌ ఇలా చేస్తున్నారనే కామెంట్స్‌ వస్తున్నాయి.