Begin typing your search above and press return to search.

బాడీ షేమింగ్ కంప్లైంట్.. సారీ చెప్పిన దర్శకుడు

By:  Tupaki Desk   |   22 April 2020 12:20 PM IST
బాడీ షేమింగ్ కంప్లైంట్.. సారీ చెప్పిన దర్శకుడు
X
ఈ జనరేషన్ లో బాడీ షేమింగ్ అనేది చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తిని వారి ఆకారాన్ని బట్టి ముఖ కవళికలను బట్టి లేదా మరేదైనా లక్షణాలను బట్టి ఎగతాళి చేసినా.. లేదా ఏడిపించినా అది చాలా దూరం పోతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలను కనుక అలా చేస్తే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఈమధ్య దుల్కర్ సల్మాన్ నిర్మించిన 'వారనె అవశ్యముండ్ 'సినిమాలో ఒక అంశం ఇలాగే వివాదాస్పదంగా మారింది.

చేతనా కపూర్ అనే ఒక రిపోర్టర్ తన ఫోటోను ఈ సినిమాలో అవమానకరంగా ఉపయోగించారని.. తన అనుమతి తీసుకోకుండా ఇలా చేయడం సరికాదని.. తన ఫోటోను సినిమా నుంచి తొలగించాలని లేదంటే బ్లర్ చేయాలని దుల్కర్ సల్మాన్ ను కోరింది. స్పందించని పక్షంలో దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని ఫిలింమేకర్ లను హెచ్చరించింది. అయితే దుల్కర్ సల్మాన్ ఈ విషయంలో వెంటనే స్పందించాడు.

ఇది ఎలా జరిగిందో నేను కనుక్కుంటాను అని.. మీ ఫోటోను ఎక్కడి నుంచి తీసుకు వచ్చారో నేను కనుక్కుంటాను అని.. సమస్యను పరిష్కరిస్తానని దుల్కర్ సల్మాన్ ఆమెకు హామీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా దర్శకుడు తమ సినిమా యూనిట్ తరఫున చేతన కపూర్ కు క్షమాపణ తెలిపాడు. ఈ ఫోటో విషయం లో త్వరగా యాక్షన్ తీసుకుంటామని కూడా వెల్లడించాడు. ఫిలిం మేకర్ లు పాజిటివ్ గా స్పందించడం తో చేతన కూడా ఈ విషయాన్ని ఇంతటి తో వదిలి పెట్టాలని నిశ్చయించుకుంది.