Begin typing your search above and press return to search.

ఇవన్నీ ధనుష్‌ సైడ్ బిజినెస్ లేనా?

By:  Tupaki Desk   |   26 Sept 2016 3:27 PM IST
ఇవన్నీ ధనుష్‌ సైడ్ బిజినెస్ లేనా?
X
మామూలుగా స్టార్ హీరోలు చాలామంది ముందుగా సినిమాల్లో యాక్ట్ చేస్తూ సంపాదిస్తారు.. ఆ తరువాత సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ సంపాదిస్తారు. అయితే నాగార్జున, రామ్ చరణ్‌, మంచు విష్ణు వంటి హీరోలు మాత్రం అసలు సినిమాలకు సంబంధం లేని ఇతర వ్యాపారాలను కూడా స్థాపించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తమిళ నటుడు ధనుష్‌ కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడని తెలుస్తోంది.

రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుపతి వెళ్లేదారిలో ఎడం చేతివైపు కొత్తగా ఒక ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం జరుగుతోంది. హాలీడే ఇన్ అంటూ టెంపరరీ నామాన్ని పెట్టేసుకున్న ఈ హోటల్ గురించి ఏ క్యాబ్ డ్రైవర్ ను అడిగినా ఒకటే మాట చెబుతున్నారు. హీరో ధనుష్‌ హోటల్ అండీ.. కాకపోతే ఇప్పుడీ నిర్మాణ బాధ్యతలన్నీ లోకల్ పార్టనర్ మంచు విష్ణు తీసుకున్నారు అంటున్నారు. మోహన్ బాబ్ అండ్ రజనీకాంత్ ఫ్యామిలీకి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా.. ఈ రూమర్ నిజమే కావొచ్చేమో. అలాగే ఆంధ్ర బోర్డర్ కు దగ్గర్లో ఉన్న వెల్లూర్ లో కూడా కింగస్టన్ కాలేజ్ అంటూ ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉంది. అది కూడా ధనుష్‌ సొంత కాలేజే అంటూ టాక్ వినిపిస్తోంది.

ఒకవేళ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ అనేది సమాజసేవ కోసమైనా.. ఈ ఫైవ్ స్టార్ హోటల్ మాత్రం మాంచి కమర్షియల్ బిజినెస్ అంటున్నారు విశ్లేషకులు.