Begin typing your search above and press return to search.

ధ‌నుష్ హాలీవుడ్ మూవీ ఆగిపోలేదే!

By:  Tupaki Desk   |   8 July 2019 7:10 AM GMT
ధ‌నుష్ హాలీవుడ్ మూవీ ఆగిపోలేదే!
X
ఒక ప్రాజెక్ట్ ఆరంభ‌మే ఆగిపోతే నిరాశే ఎదుర‌వుతుంది. కానీ ఆగిపోయింది అనుకున్న మూవీ తిరిగి మొద‌లైతే ఆ ఉత్సాహ‌మే వేరు. ప్ర‌స్తుతం అలాంటి ఎగ్జ‌యిటింగ్ మూవ్ మెంట్ ని ఆస్వాధిస్తున్నాడు త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్. ఆగిపోయింది అనుకున్న ఓ ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్ట్ నిర్మాత దొర‌క‌డంతో టేకాఫ్ అవుతోంది. వివ‌రాల్లోకి వెళితే..

రెండేళ్ల క్రితం ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. హాలీవుడ్ స్టాండార్డ్స్ లో తెర‌కెక్కించాల‌నుకున్న ఈ చిత్రంలో ప్ర‌ఖ్యాత హాలీవుడ్ స్టార్ అల్ పాసినో న‌టిస్తార‌ని ప్ర‌చార‌మైంది. అంత పెద్ద స్టార్ తో క‌లిసి ధ‌నుష్ హాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడంటూ కోలీవుడ్ మీడియా ప్ర‌చారం ఊద‌ర‌గొట్టింది. కానీ అంత‌లోనే ఏమైందో ఆ ప్రాజెక్ట్ సెట్స్ కెళ్ల‌కుండానే ఆగిపోయింది. బ‌డ్జెట్ల ప‌ర‌మైన స‌మ‌స్య ఎదురైంది. నిర్మాత‌ల వైపు నుంచి స‌రైన స్పంద‌న లేక‌పోవ‌డంతో ఆగిపోయింద‌ని ప్ర‌చార‌మైంది.

తాజాగా ఈ ప్రాజెక్ట్ ని రీబూట్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. గురు- గేమ్ ఓవ‌ర్ లాంటి క్రేజీ చిత్రాల్ని నిర్మించిన శ‌శికాంత్ ఈ సినిమాని నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివ‌రిలో సెట్స్ పైకి వెళతార‌ని తెలుస్తోంది. లండ‌న్ లో కీల‌క‌మైన షెడ్యూల్ ని తెర‌కెక్కించాల్సి ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లోనే మీడియాకి వెల్ల‌డిస్తార‌ని తెలుస్తోంది.