Begin typing your search above and press return to search.

ప్ర‌కృతిని కాపాడాలంటూ న‌గ్నంగా హీరో.. ఆకులు, పువ్వుల‌తో దేహం క‌ప్పుకున్నాడు!

By:  Tupaki Desk   |   14 March 2021 3:30 PM GMT
ప్ర‌కృతిని కాపాడాలంటూ న‌గ్నంగా హీరో.. ఆకులు, పువ్వుల‌తో దేహం క‌ప్పుకున్నాడు!
X
హాలీవుడ్ లో స్టార్ల కోసం క‌థ‌లు రాయ‌డం త‌క్కువ‌.. క‌థ‌ల నుంచే స్టార్లు ఉద్భ‌విస్తుంటారు. ఈ త‌ర‌హా సినిమాలు ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో హీరోలు కూడా మూస ప‌ద్ధ‌తిలో సాగే హీరోయిజానికి కాకుండా.. పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే పాత్ర‌లు చేస్తున్నారు. తాజాగా.. ప్ర‌ముఖ‌ బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ ఇదే త‌ర‌హా మూవీలో నటిస్తున్నారు.

‘ఓకే కంప్యూట‌ర్‌’ పేరుతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లో జాకీ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ లో దుస్తులు లేకుండా కనిపించారు జాకీ. ఒంటిపై నూలుపోగు లేకుండా.. చెట్ల పొద‌ల మాటున నిల్చున్నారు. ట్రైల‌ర్ రిలీజ్ అయిన త‌ర్వాత.. లేటెస్ట్ గా సినిమా గురించి మాట్లాడారు ష్రాఫ్‌.

మితిమీరిన సాంకేతిక‌త‌ను, సైన్స్ ను వ్య‌తిరేకించే పుష్ప‌క్ పాత్ర‌లో తాను క‌నిపించ‌బోతున్న‌ట్టు చెప్పారు. టెక్నాల‌జీకి కాకుండా.. ప‌ర్యావ‌ర‌ణానికి యువ‌త ప్రాధాన్యం ఇవ్వాల‌నే క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంద‌ని తెలిపారు. ఈ మూవీలో తాను చెట్ల ఆకులు, పువ్వుల‌తో దేహాన్ని క‌ప్పుకుని క‌నిపిస్తాన‌ని చెప్పారు.