Begin typing your search above and press return to search.

నా కెరీర్ ను నాశనం చేశారంటున్న హీరో!

By:  Tupaki Desk   |   25 July 2019 2:36 PM GMT
నా కెరీర్ ను నాశనం చేశారంటున్న హీరో!
X
ఈ జెనరేషన్ ప్రేక్షకులకు హీరో ఆకాష్(జై ఆకాష్ అని కూడా అంటారు) ఎవరంటే తెలియకపోవచ్చు. కానీ కాస్త ముందు జెనరేషన్ వారికి ఆకాష్ పరిచయమే. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆనందం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా సూపర్ కావడంతో క్రేజ్ వచ్చింది కానీ ఆ తర్వాత ఆ క్రేజ్ ను నిలబెట్టుకోలేక ఫేడ్ అవుట్ అయ్యాడు. ఆకాష్ తన తమిళ సినిమా ను కాపీ కొట్టి 'ఇస్మార్ట్ శంకర్' ను పూరి జగన్నాధ్ తెరకెక్కించాడు అని ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా ఆయనపై మీడియా ఫోకస్ చేసింది. ఆకాష్ చెప్తున్న సదరు తమిళ సినిమాను 'కొత్తగా వచ్చాడు' పేరుతో రిలీజ్ చేస్తున్నాడు. ఆ సినిమా ట్రైలర్ కూడా తాజాగా రిలీజ్ అయింది.

ఇదిలా ఉంటే ఆకాష్ వెబ్ ఛానెల్స్ కు ఇస్తూ వీలైనన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ యూట్యూబ్ ఛానెల్స్ కు సంక్రాంతి.. రంజాన్ క్రిస్మస్ పండగలను ఒకేసారి తీసుకొచ్చాడు. పూరి మీద ఆరోపణలే అనుకుంటే.. సునీల్ మీద కూడా కృతజ్ఞత లేని వ్యక్తి అని విరుచుకుపడ్డాడు. అంతే కాదు తన కెరీర్ ఇలా మందగించడానికి కారణం చెత్త సినిమాలు చేయడం కాదట. తనను ఇండస్ట్రీలోని వారు తొక్కేశారు అంటున్నాడు. అలా మీ కెరీర్ ను నాశనం చేసిన వారు ఎవరు? అని అడిగితే వారి పేర్లు చెప్పకుండా కొందరు దర్శకులు.. నిర్మాతలు అని జవాబిచ్చాడు. 'ఆనందం' సినిమా తర్వాత తాను నటించిన ఐదు సినిమాలు విడుదల కాకుండా చేసి తన కెరీర్ ను నాశనం చేశారని అన్నాడు.

'ఆనందం' కంటే ముందు 'ఇష్టపడి' అనే సినిమా చేస్తే ఆ సినిమా షూటింగ్ పూర్తయినా విడుదల కానివ్వలేదు అన్నాడు. అది ఖచ్చితంగా హిట్ కావాల్సిన సినిమా కానీ రిలీజ్ కాకపోవడంతో నష్టం జరిగింది అన్నాడు. ఆ సినిమా తర్వాత ముత్యాల సబ్బయ్య దర్శకత్వంలో 'ఇదేం ఊరురా బాబు'.. తమిళ దర్శకుడు డైరెక్టర్ విక్రమన్‌ తో 'ఆకాశం' చేశాను. మరో సినిమా 'జూన్ జూలై'లో కూడా నటించాను. అయితే ఆ సినిమాలను రిలీజ్ కాకుండా కొందరు అడ్డుకుని తన కెరీర్ ను స్పాయిల్ చేశారన్నాడు.

మరి మీ కెరీర్ ను ఎవరైనా ఎందుకు నాశనం చేస్తారు? అని ప్రశ్నిస్తే "వారికి భయం.. నేను ఎంత పెద్ద హీరో అవుతానో అని భయం. మొదటి సినిమానే సూపర్ హిట్ అయింది. మరో రెండు హిట్స్ తగిలితే కెరీర్ ను ఎవ్వరూ ఆపలేరు.. అందుకే అలా జరగక ముందే సినిమాలను అడ్డుకున్నారు" అన్నాడు.