Begin typing your search above and press return to search.

అబ్బాస్ కు ఏమైంది.. చేతి కర్రతో షాక్ ఇచ్చిన హీరో..!

By:  Tupaki Desk   |   22 Nov 2022 5:42 AM GMT
అబ్బాస్ కు ఏమైంది.. చేతి కర్రతో షాక్ ఇచ్చిన హీరో..!
X
ప్రేమదేశం అబ్బాస్ గుర్తున్నాడు కదా.. అప్పటి యూత్ ని ఆకట్టుకున్న అతను సినిమాలకు గుడ్ బై చెప్పి అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. సినిమాలు చేయకపోయినా హార్పిక్ యాడ్ తో కొన్నాళ్లు సందడి చేశాడు అబ్బాస్. హార్పిక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చాలా ఏళ్లు చేసిన అబ్బాస్ ఇప్పుడు అది కూడా వదిలేశాడు.

సినిమాలు వదిలేసి ఎంచక్కా సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకుంటున్న అబ్బాస్ చేతి కర్రతో కనబడి ఆడియన్స్ కి షాక్ ఇచ్చాడు. అసలు ఇంతకీ అబ్బాస్ కి ఏమైంది అంటే.. కొద్దిరోజులుగా కాలి నొప్పితో బాధపడుతున్న అతను డాక్టర్స్ సర్జరీ చేయాలని చెప్పారట.

సర్జరీ అని చెప్పినప్పటి నుంచి మనసు ఆందోళనగా ఉంది. కానీ సర్జరీ చేయించుకున్న తర్వాత చాలా బెటర్ గా ఉందని అంటున్నారు అబ్బాస్. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నారు.

చేతి కర్రతో అబ్బాస్ ని చూసి అతని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. త్వరగా కోలుకోవాలని మెసేజ్ లు చేస్తున్నారు. ప్రేమదేశం టైం లో అబ్బాస్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అప్పట్లో అబ్బాస్ కటింగ్ కూడా పాపులర్ అయ్యంది. అతన్ని ఇమిటేట్ చేస్తూ హెయిర్ కట్ చేసుకునే వారు.

తమిళంలోనే కాదు తెలుగులో కూడా అబ్బాస్ మంచి సినిమాలు చేశాడు. తెలుగు ప్రేక్షకులకు అబ్బాస్ సుపరిచితుడే.. ఈమధ్య అసలు మీడియాకి కనిపించని అబ్బాస్ సడెన్ గా కాలికి సర్జరీ చేయించుకుని కనిపించాడు.

అబ్బాస్ ని ఇలా చూడలేకపోతున్నాం అంటూ ఫ్యాన్స్ మెసేజ్ లు పెడుతున్నారు. ఒకప్పటి హీరోలంతా కూడా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరి వారి లానే అబ్బాస్ కూడా రీ ఎంట్రీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. హీరోగానే కాదు కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూదా చేసిన అబ్బాస్ ఒకవేళ తనకు ఛాన్స్ వస్తే మాత్రం ఎలాంటి పాత్రలో అయినా చేయడానికి రెడీ అంటున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.