Begin typing your search above and press return to search.

మహేష్‌ ను అప్పుడు తిట్టిన వారే ఇప్పుడు అభినందిస్తున్నారు

By:  Tupaki Desk   |   9 April 2020 2:30 PM GMT
మహేష్‌ ను అప్పుడు తిట్టిన వారే ఇప్పుడు అభినందిస్తున్నారు
X
మహేష్‌ బాబు తన 26వ చిత్రాన్ని సుకుమార్‌ దర్శకత్వంలో చేస్తానంటూ 25వ చిత్రం మహర్షి టైంలోనే క్లారిటీ ఇచ్చాడు. రంగస్థలం పూర్తి అయినప్పటి నుండి దర్శకుడు సుకుమార్‌ తన తదుపరి చిత్రం మహేష్‌ బాబుతో చేయాలనే నిర్ణయంతో స్క్రిప్ట్‌ తయారు చేసుకున్నాడు. దాదాపు సంవత్సరంకు పైగా సుక్కును తిప్పుకున్న మహేష్‌ బాబు చివరకు ఈ ప్రాజెక్ట్‌ వర్కౌట్‌ కాదంటూ అనీల్‌ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని మొదలు పెట్టాడు. సుకుమార్‌ టైం అంతా వేస్ట్‌ చేశాడు అంటూ మహేష్‌ బాబు పై ఆ సమయంలో చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు.

మహేష్‌ బాబు చెప్పిన స్క్రిప్ట్‌ నే అల్లు అర్జున్‌ వద్దకు తీసుకువచ్చి ‘పుష్ప’ అనే టైటిల్‌ తో సినిమా తీసేందుకు సుకుమార్‌ రెడీ అయ్యాడు. నిన్న బన్నీ బర్త్‌ డే సందర్బంగా ఫస్ట్‌ లుక్‌ వచ్చింది. ఫస్ట్‌ లుక్‌ లో మాస్‌ లుక్‌ ఇంకా బాడీ లాంగ్వేజ్‌ హెయిర్‌ స్టైల్‌ చూసి ఇది ఖచ్చితంగా మహేష్‌ బాబు చేస్తే వర్కౌట్‌ అయ్యేది కాదు. అసలు మహేష్‌ బాబు ఇలాంటి లుక్‌ లో కనిపించేందుకు ఒప్పుకునేవాడు కాదు. లుక్‌ విషయంలో రాజీ పడాల్సి వచ్చేది. ఒకవేళ మహేష్‌ బాబు ఆ లుక్‌ లో కనిపించినా కూడా ఆయనకున్న ఫ్యాన్స్‌ అలా చూసేవారు కాదేమో. అందుకే మహేష్‌ బాబు పుష్ప సినిమాను వదిలి పెట్టి ఉంటాడేమో అనే టాక్‌ వస్తుంది.

గతంలో సుకుమార్‌ టైం అంతా వేస్ట్‌ చేశాడంటూ మహేష్‌ పై విమర్శలు చేసిన వారు ఇప్పుడు మహేష్‌ తీసుకున్న నిర్ణయం సరైనదే అని.. బన్నీ లేదా చరణ్‌ కు అయితేనే ఈ ప్రాజెక్ట్‌ సెట్‌ అవుతుందని చెప్పి తప్పుకోవడం అభినందనీయం అంటూ అభినందిస్తున్నారు. మహేష్‌ తీసుకున్న నిర్ణయం సరైనదే అని కమిట్‌ అయ్యాను కనుక చేయాలనుకోకుండా సినిమాను క్యాన్సిల్‌ చేసుకోవడం మంచి నిర్ణయంగా గతంలో విమర్శించిన వారు ఇప్పుడు అభినందిస్తున్నారు.