Begin typing your search above and press return to search.

ఈ శుక్రవారం వినోదాల విందు జాబితా ఇదిగో

By:  Tupaki Desk   |   19 July 2022 8:00 PM IST
ఈ శుక్రవారం వినోదాల విందు జాబితా ఇదిగో
X
సినీ ప్రేమికులకు ప్రతి శుక్రవారం పండగ. ఒకప్పుడు ప్రతి శుక్రవారం థియేటర్‌ లలో ఏం సినిమా లు వస్తాయా అంటూ ఎదురు చూసేవారు. కాని ఇప్పుడు శుక్రవారం కేవలం థియేటర్లో ఏం సినిమాలు వస్తాయి అనే విషయం మాత్రమే కాకుండా ఓటీటీ లో ఏం స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నాయి అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంటర్‌టైన్మెంట్‌ కు శుక్రవారం ఒక పండుగ సమయం అయ్యింది.

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా సినిమాలు మరియు సిరీస్ లతో ప్రేక్షకులకు పండుగ రాబోతుంది. సినిమాల విషయానికి వస్తే నాగ చైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ శుక్రవారం అక్కినేని ఫ్యాన్స్ కు పండగే. ఇక బాలీవుడ్‌ మోస్ట్‌ క్రేజీ మూవీగా చెప్పుకుంటున్న షంషేరా సినిమా కూడా ఈ ఇదే వారంలో విడుదల కాబోతుంది.

ఈ సినిమా కేవలం హిందీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు చూస్తారని యూనిట్‌ సభ్యులు నమ్ముతున్నారు. ఇంకా ఈ శుక్రవారం మహా మరియు మలయకుంజు సినిమాలు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు ఒక్క రోజు ముందే అన్నట్లుగా మలయాళ మూవీ మహా వీరయార్ సినిమా కూడా థియేటర్‌ లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.

ఇక ఓటీటీ విషయానికి వస్తే.. ఏజెంట్‌ ఆనంద్ సంతోష్‌ అనే వెబ్‌ సిరీస్ ను ఆహా వారు తీసుకురాబోతున్నారు. ఈ వెబ్‌ సిరీస్ లో యూట్యూబర్ షన్ముక్‌ జష్వంత్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ వెబ్‌ సిరీస్ మాత్రమే కాకుండా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఎఫ్‌ 3 స్ట్రీమింగ్‌ కూడా నెట్‌ ఫ్లిక్స్ మరియు సోనీ లివ్‌ లో ఈ వారంలోనే ఉంది. ఇక ధనుష్ నటించిన ది గ్రే మ్యాన్ అనే ఇంగ్లీష్ సినిమా కూడా నెట్‌ ఫ్లిక్స్ వారు ఈ వారం స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.

పరంపర మొదటి సీజన్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రెండవ సీజన్ పై ఆసక్తి ఉంది. ఆ క్రేజీ పరంపర సీజన్‌ 2 ఈ వారంలోనే స్ట్రీమింగ్‌ కు రెడీగా ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో పరంపర 2 స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. ఇవి మాత్రమే కాకుండా వివిధ భాషలకు సంబంధించిన సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేయబోతున్నాయి. కనుక ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈ వారం కూడా పండగో...!