Begin typing your search above and press return to search.

ఓటీటీకి థియేట‌ర్ ఓన‌ర్లు క్లియ‌రెన్స్ ఇవ్వ‌కుండానే!

By:  Tupaki Desk   |   16 May 2020 12:15 PM IST
ఓటీటీకి థియేట‌ర్ ఓన‌ర్లు క్లియ‌రెన్స్ ఇవ్వ‌కుండానే!
X
ఓవైపు ఓటీటీ రిలీజ్ అంటే ఎగ్జిబిట‌ర్లు (థియేట‌ర్ య‌జ‌మానులు) భ‌గ‌భ‌గ మండుతున్నారు. ఐమ్యాక్స్ - ఐనాక్స్ -పీవీఆర్ స‌హా ప‌లు మ‌ల్టీప్లెక్స్ దిగ్గ‌జాల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టే స‌న్నివేశ‌మే ఇది. ఓటీటీ రిలీజ్ ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న వాళ్ల‌లో సింగిల్ థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌నే కాదు ఐనాక్స్ వంటి కార్పొరెట్ దిగ్గ‌జ కంపెనీలే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఓటీటీ లో రిలీజ్ చేస్తే థియేట‌ర్ల‌లో ఇక ఆ స్టార్ సినిమాని రిలీజ్ కానివ్వ‌మ‌ని వార్నింగులు ఇస్తున్నారు. అయినా ఇలాంటి స‌న్నివేశంలోనూ నిర్మాత‌ల తెగువ‌తో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి ప‌లు సినిమాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా అమెజాన్ లో ఏకంగా ఏడు సినిమాలు రిలీజై పోతున్నాయి. వాటి వివ‌రాల్ని ప‌రిశీలిస్తే...

అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల కానున్న 7 కొత్త సినిమాల జాబితాలో ప్ర‌ముఖ స్టార్లు న‌టించిన‌వి ఉన్నాయి. సుర్జీత్ సిర్కార్ తెర‌కెక్కించిన గులాబో సితాబో వీటిలో ఒక‌టి. అమితాబ్ బచ్చన్ - ఆయుష్మాన్ ఖుర్రానా నటించారు. ఇది హిందీ కామెడీ-డ్రామా చిత్రం. ఈ చిత్రం లక్నో నేప‌థ్యంలో తెర‌కెక్కింది. దీనిని రోనీ లాహిరి -షీల్ కుమార్ నిర్మించారు. జూన్ 12 న సినిమా విడుదలకానుంది.

జ్యోతిక క‌థానాయిక‌గా తెర‌కెక్కిన `పొన్మగల్ వంధల్` తమిళ చిత్రం అమెజాన్ లో మే 29న రిలీజ‌వుతోంది. కొత్త ద‌ర్శ‌కుడు జె.జె.ఫెడ్రిక్ దర్శకత్వం వహించిన తమిళ లీగల్ డ్రామా చిత్రమిది. జ్యోతిక- పార్థిబాన్- భాగ్యరాజ్- ప్రతాప్ పోథెన్- పాండిరాజన్ నటించారు. ఈ చిత్రాన్ని సూర్య- రాజశేకర్ -క‌ర్పూర సుందరపాండియన్ నిర్మించారు. అలాగే కీర్తి సురేష్ న‌టించిన `పెంగ్విన్` (తమిళం -తెలుగు) అమెజాన్ లో జూన్ 19న విడుద‌ల‌వుతోంది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ - కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించిన ఈ చిత్రానికి ఇషావర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. పెంగ్విన్ ఒక డ్రామా చిత్రం. జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించ‌గా.. ప‌లువురు న‌టులు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

లీగల్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ క‌న్న‌డ‌ చిత్రం లా (చ‌ట్టం) జూన్ 26న అమెజాన్ ప్రైమ్ లో లో రిలీజ‌వుతోంది. రాఘు సమర్త్ రచన .. దర్శకత్వం వహించారు. అశ్విని - పునీత్ రాజ్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో రాగిణి చంద్రన్- సిరి ప్రహ్లాద్- ప్రముఖ నటుడు ముఖ్యామంత్రి చంద్రు నటించారు. ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ) జూలై 24 న విడుదల అవుతుంది. ప్రఖ్యాత హాస్యనటుడు డానిష్ సైట్.. సల్ యూసుఫ్ - పిటోబాష్ లతో పాటు మరొక పాత్రలో నటించారు. పన్నగా భరనా దర్శకత్వం వహించిన అవినాష్ బాలెక్కల రచయిత‌. ఈ చిత్రాన్ని అశ్విని - పునీత్ రాజ్‌కుమార్ -గురుదత్ ఎ తల్వార్ నిర్మించారు.

విద్యాబాల‌న్ న‌టించిన బ‌యోపిక్ చిత్రం `శకుంతల దేవి` రిలీజ్ తేదీ ప్ర‌క‌టించాల్సి ఉంది. విద్యాబాలన్ `హ్యూమన్ కంప్యూటర్`గా నటించిన ఈ హిందీ చిత్రానికి అను మీనన్ రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జిషు సేన్ ‌గుప్తా- సన్యా మల్హోత్రా- అమిత్ సాధ్ కీలక పాత్రలు పోషించారు. అలాగే `సుఫియం సుజాతయం` (మలయాళం) రిలీజ్ తేదీ తెలియాల్సి ఉంది. ఈ జాబితాలో ఉన్న ఏకైక మలయాళ చిత్రమిదే. విజయ్ బాబు ఫ్రైడే ఫిల్మ్ హౌస్ నిర్మించిన ఈ మలయాళ రొమాంటిక్ డ్రామా మూవీలో అదితి రావు హైద‌రి - జయసూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి నరణిపుళ షానవాస్ రచన -దర్శకత్వం వహించారు. అయితే ఓటీటీలో స‌వ్యంగా రిలీజ‌వ్వాలంటే ఎగ్జిబిట‌ర్ తో ఎలాంటి స‌మ‌స్యా ఉండ‌కూడదు. దానిని ప‌రిష్క‌రించుకుని వ‌స్తే బావుంటుందనే అభిప్రాయం ప‌రిశ్ర‌మ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.