Begin typing your search above and press return to search.

అందాల ఫరియా జోరు అందుకే పెరగడం లేదా?

By:  Tupaki Desk   |   13 May 2021 11:30 PM GMT
అందాల ఫరియా జోరు అందుకే పెరగడం లేదా?
X
ఇటీవల కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో ఫరియా అబ్దుల్లా ఒకరుగా కనిపిస్తుంది. 'జాతిరత్నాలు' సినిమాలో తళుక్కున మెరిసిన ఈ సుందరిని చూసి కుర్రాళ్లు కర్చీఫులు పారేసుకున్నంత తేలికగా పడుచు మనసులను పారేసుకున్నారు. ఫరియా మంచి పొడగరి .. అందుకు తగిన పర్సనాలిటీతో ఆకర్షణీయంగా ఉంటుంది. చక్కని పలువరుసతో .. చిక్కనైన పెదాలతో .. ఆకాశాన్ని దాచేసే విశాలమైన కళ్లతో .. విల్లు వంచినట్టుగా ఉండే దట్టమైన కనుబొమలను తోడుగా చేసుకున్న ఈ అమ్మాయి నవ్వు, మరింత అందంగా ఉంటుంది.

వినోదం పరంగా 'జాతిరత్నాలు' సినిమా గురించి మాట్లాడుకున్న వాళ్లంతా, ఈ అమ్మాయి గ్లామర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. నిండు చందమామలా ఉన్న ఈ అమ్మాయికి అభిమానులుగా మారిపోయారు. తెలుగు తెరను ఈ బ్యూటీ ఏలేయడం ఖాయమని అనుకున్నారు. ఆల్రెడీ ఆమెకు కొన్ని అవకాశాలు వచ్చాయని కూడా చెప్పుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఆమెకు అవకాశాలు దక్కడం లేదనే చెప్పాలి. అందుకు కారణం ఆమె అందమో .. నటనో కాదు .. ఆమె హైటూ అనే మాటనే వినిపిస్తోంది.

హీరోయిన్లు అందంగా ఉండి .. హైటూ తక్కువగా ఉంటే కెమెరా ముందు ఆ విషయం తెలియకుండా ఎలాగోలా మేనేజ్ చేస్తారు. కానీ హీరోయిన్ హైటు ఎక్కువ ఉంటే మాత్ర్రం చేసేదేం ఉండదు. అలాంటప్పుడు ఆ హీరోయిన్లు మంచి హైటున్న హీరోల సినిమాల్లోనే అవకాశాలను చేజిక్కించుకోవలసి ఉంటుంది. ప్రభాస్ .. మహేశ్ బాబు .. గోపీచంద్ .. నాగశౌర్య ... ఇలా హైటున్న హీరోల జోడీగా ఫరియా నప్పుతుంది. తన హైటూ అవకాశాలకు అడ్డుపడుతోందని అంటున్నారు. పొడగరి భామలకు సినిమాల్లో అవకాశాలు కాస్త తక్కువగా ఉన్నా, మోడలింగ్ రంగాన్ని మాత్రం ఒక ఊపు ఊపేయవచ్చు.