Begin typing your search above and press return to search.

ఆమె డ్రస్‌ అక్షరాల రూ.37 కోట్లు

By:  Tupaki Desk   |   5 Nov 2020 10:15 AM IST
ఆమె డ్రస్‌ అక్షరాల రూ.37 కోట్లు
X
బాలీవుడ్‌ మోస్ట్‌ హ్యాపెనింగ్‌ హీరోయిన్‌.. మోడల్‌ ఊర్వశి రౌతెలా తన ఫొటో షూట్స్‌ తో రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో ట్రెండ్డింగ్‌ లో ఉంటూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి తాను ధరించిన కాస్ట్యూమ్స్ వల్ల ట్రెండ్‌ అవుతుంది. ఈమె ఈజిప్ట్‌ మహారాణి క్లియోపాత్రగా నటించబోతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ది గాంచిన ధీర వనిత అయిన క్లియో పాత్ర గా నటించేందుకు ఆమె చాలా వర్కౌట్స్‌ చేస్తుంది. ఇదే సమయంలో ఆమె కాస్ట్యూమ్స్‌ విషయంలో అత్యంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహారాణి పాత్ర అవ్వడంతో ఊర్వశి కోసం 5 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసి డ్రెస్‌ ను రెడీ చేశారు.

అయిదు మిలియన్‌ డాలర్లు అంటే ఏకంగా రూ.37 కోట్లతో ఊర్వశికి కాస్ట్యూమ్స్‌ ను రెడీ చేశారు. తాజాగా జరిగిన అరబ్‌ ఫ్యాషన్‌ వీక్‌ షో లో ఊర్వశి రౌతెలా ఆ అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్స్‌ లో కనిపించింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్‌ గా ఈమె ధరించిన డ్రస్‌ కు గుర్తింపు దక్కింది. ఖరీదైన కాస్ట్యూమ్స్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ అన్నట్లుగా ఉండే ఊర్వశి రౌతెలా గతంలో కూడా దాదాపు 60 లక్షల రూపాయల విలువ చేసే లెహంగాను ధరించి బాలీవుడ్‌ స్టార్‌ నేహా కక్కర్‌ వివాహ వేడుకలో పాల్గొంది. ఈమె తెలుగులో బ్లాక్‌ రోజ్‌ అనే సినిమాలో నటిస్తుంది. సంపత్‌ నంది ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.