Begin typing your search above and press return to search.

వన్ మ్యాన్ ఆర్మీ... పవన్ గురించి ఆమె కామెంట్స్‌

By:  Tupaki Desk   |   29 Dec 2021 8:42 AM GMT
వన్ మ్యాన్ ఆర్మీ... పవన్ గురించి ఆమె కామెంట్స్‌
X
పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం దక్కిన ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీలో గుర్తుండి పోయేలా కెరీర్‌ ను కొనసాగిస్తుంది అనడంలో సందేహం లేదు. ఆయన తో ఒక్క హిట్‌ పడితే నేరుగా స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చేరిపోవడం ఖాయం. అందుకే ఆయనతో సినిమా లను చేసేందుకు ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన భీమ్లా నాయక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. సంక్రాంతికి రావాల్సి ఉన్నా కూడా ఇటీవలే వాయిదా పడి తదుపరి నెలలో విడుదల కాబోతుంది. భీమ్లా నాయక్ తో సంబంధం లేదు అన్నట్లుగా క్రిష్ తన హరి హర వీరమల్లు సినిమాను వచ్చే నెల నుండి పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ సినిమా లో పవన్‌ కు జోడీగా ఇస్మార్ట్‌ హాటీ నిధి అగర్వాల్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

పవన్ తో కలిసి నటించడం అద్బుతం అన్నట్లుగా నిధి అగర్వాల్‌ సందర్బం వచ్చిన ప్రతి సారి అంటూనే ఉంది. తాజాగా సోషల్‌ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు నిధి సమాధానాలు చెప్పింది. ఆస్క్ మీ అనగానే వందల కొద్ది పవన్‌ మరియు హరి హర వీరమల్లు గురించిన ప్రశ్నలు వేశారు. వందల కొద్ది వచ్చిన ఆ ప్రశ్నలకు నిధి ఒకే ఒక్క సమాధానం వచ్చింది. అదే పవన్ ఒక వన్‌ మ్యాన్‌ ఆర్మీ.. ఆయనతో వర్క్‌ చేయడం అద్బుతం అదృష్టం. నాకు ఎప్పటికి ఇష్టమైన అభిమాన హీరో. ఒక అద్బుతమైన నటన ప్రతిభ ఉన్న వ్యక్తి.. దేవుడి ద్వారా ఆశీర్వాదం పొందిన వ్యక్తి పీకే సర్ అన్నట్లుగా సమాధానం ఇచ్చింది.

నిధి అగర్వాల్‌ ఈ సినిమా లో యువ రాణి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. హరి హర వీరమల్లు సినిమా కథ మెయిన్‌ పాయింట్‌ మొత్తం కూడా హీరోయిన్ పాత్ర చుట్టు తిరుగుతుందని... పవన్ మరియు నిధి అగర్వాల్‌ ల మద్య ఉండే సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా.. ఆకట్టుకునే విధంగా ఉంటాయని అంటున్నారు. ఇప్పటి వరకు స్కిన్‌ షో చేసి మెప్పించిన నిధి అగర్వాల్‌ ఈ సినిమా లో కొత్తగా తనను తాను ఆవిష్కరించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పవన్‌ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాను చేయడం ద్వారా గొప్ప అవకాశం దక్కించుకున్నట్లుగా నిధి అగర్వాల్‌ ఆనందం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా మాత్రమే కాకుండా ఇంకా చాలా సినిమాలు కూడా ఆమె చేస్తుంది. మహేష్ బాబు అల్లుడు నటించిన హీరో సినిమా త్వరలో విడుదల కాబోతుంది. అందులో హీరోయిన్ గా నిధి అగర్వాల్‌ నటించిన విషయం తెల్సిందే. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తుంది. సినిమాలతో పాటు ఈమె వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.