Begin typing your search above and press return to search.

మాస్ రాజా హ్యాట్రిక్‌ హిట్‌ పై ఆమె కెరీర్‌ ఆధారపడింది!

By:  Tupaki Desk   |   21 Jan 2023 1:30 AM GMT
మాస్ రాజా హ్యాట్రిక్‌ హిట్‌ పై ఆమె కెరీర్‌ ఆధారపడింది!
X
ధమాకా మరియు వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్ లను తన ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రావణాసుర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. టైటిల్ విభిన్నంగా ఉండటంతో పాటు ఇప్పటికే విడుదల అయిన రవితేజ లుక్ సినిమా పై అంచనాలు పెంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రావణాసుర సినిమాలో రవితేజకు జోడీగా జాతిరత్నాలు ముద్దుగుమ్మ ఫరియా అబ్ధుల్లా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై ఫరియా ఆశలు పెట్టుకుంది. జాతిరత్నాలు సినిమా సూపర్‌ హిట్ అయినా కూడా ఫరియా కు ఆ స్థాయిలో ఆఫర్లు రాలేదు.

లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్ అనే చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫరియా పెద్దగా ఫలితం పొందలేక పోయింది. ఆ సినిమా తర్వాత మళ్లీ రవితేజ నటిస్తున్న ఈ సినిమా లో ఫరియా అబ్ధుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. మొన్నటి వరకు వాల్తేరు వీరయ్య హడావుడిలో ఉన్న రవితేజ ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో రావణాసుర సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యాడు.

ధమాకా మరియు వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత రవితేజకు రావణాసుర హ్యాట్రిక్ విజయాన్ని అందించడం ఖాయం అంటూ ఆయన అభిమానులు ధీమాతో ఉన్నారు. ఈ సమ్మర్ లోనే విడుదల కాబోతున్న రవితేజ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకుంటేనే ఫరియా కెరీర్‌ కాస్త గాడిలో పడ్డట్లు అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.