Begin typing your search above and press return to search.

వెడ్డింగ్ సాంగ్.. బాగానే ఉంది కాని..

By:  Tupaki Desk   |   6 Dec 2017 11:10 AM GMT
వెడ్డింగ్ సాంగ్.. బాగానే ఉంది కాని..
X
అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన సినిమా 'హలో'. దీనిని కింగ్ నాగార్జున ఏకంగా అఖిల్ రీలాంచ్ అన్న తరహాలో భారీ రేంజులో ప్రొజెక్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా నుండి తొలి వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. పదండి అసలు ఎలా ఉందో చూద్దాం.

అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన 'వెడ్డింగ్ సాంగ్' తాలూకు 1 మినిట్ వీడియోను ఈరోజు నాగార్జున రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియో అంతా కూడా నిజంగానే ఒక వెడ్డింగ్ వాతావరణం తలపిస్తూ.. అలాగే పిఎస్ వినోద్ అందించిన విజువల్స్ ను పోగేసుకుని.. చాలా ఆహ్లాదకరంగానే ఉందిలే. ట్యూన్ పరంగా అంత కిక్ ఇవ్వకపోయినా కూడా.. విజువల్స్ బాగున్నాయి. అలాగే అఖిల్ అండ్ కళ్యాణి లుక్స్స్ కూడా అదిరిపోయాయ్. అఖిల్ వేసిన డ్యాన్స్ మరీ కొత్తగా ఏమీ లేకపోయినా కూడా.. ఆ పాటకు తగ్గట్లు బాగానే ఉంది.

ఒక విధంగా చూస్తే అనూప్ కంపోజ్ చేసిన ఈ పాట.. అలాగే ఈ పాటను తీసిన తీరు.. గతంలో ఇదే డైరక్టర్ ఇష్క్ సినిమా కోసం నితిన్ అండ్ నిత్యా మీనన్ పై తీసిన 'సూటిగా..చూడకు' వెడ్డింగ్ సాంగ్ తరహాలోనే ఉంది. ఏదేమైనా కూడా దర్శకుడు విక్రమ్ మాత్రం ఇలా వెడ్డింగ్ సాంగ్స్ తో ఎమోషన్ పండించడంలో బాగా దిట్టయిపోయాడు. అది సంగతి.