Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: హలో.. చిన్నదానికోసం..

By:  Tupaki Desk   |   1 Dec 2017 12:31 PM GMT
ట్రైలర్ టాక్: హలో.. చిన్నదానికోసం..
X
ఇప్పుడు వస్తున్న చాలా సినిమాల్లో.. కథ సింపుల్ గా ఉంటూ స్ర్కీన్ ప్లే చాలా స్ర్టాంగ్ గా ఉంటోంది. చూస్తుంటే అక్కినేని అఖిల్ కొత్త సినిమా ''హలో'' కూడా అలాగే ఉందనే చెప్పుకోవాలి. చాలా రోజులు నుండి ఊరిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు రిలీజైంది. పదండి ఎలా ఉందో చూద్దాం.

నిజానికి చిన్నప్పుడు తప్పిపోయిన ఇద్దరు చిన్ననాటి లవ్ బర్డ్స్.. పెద్దయ్యాక ఒకరినొకరు వెతుక్కోవడం అనేది చాలాసార్లు చూసిందే. సేమ 'మనసంతా నువ్వే' సినిమా కథ తరహాలో అనిపిస్తున్న 'హలో' ట్రైలర్లో.. కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. అఖిల్ లుక్స్ అండ్ కళ్యాణి హావభావాలు అదిరిపోయాయ్. ఇకపోతే ఒక ఫోన్ కోసం పెద్ద రాద్దాంతం అనేదే మెయిన్ పాయింట్ లా ఉంది. అది కూడా ఆసక్తికరంగానే ఉంది. అలాగే యాక్షన్ సీన్స్ కూడా అస్సలు కట్ ఎక్కడైందో తెలియనంత ఉత్కంఠగా ఉంటే అదిరాయ్. అయితే సింపుల్ స్టోరీలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఎలాంటి ట్విస్టులు ఇచ్చాడు అనే దానినిబట్టి సినిమా రిజల్ట్ ఉంటుంది. ట్రైలర్లో ఆకట్టుకున్న ఇతర అంశాలంటే.. అజయ్ విలనీ.. రమ్య కృష్ణ అనే చెప్పుకోవాలి.

పిఎస్ వినోద్ అందించిన విజువల్స్ అదిరిపోయాయ్ కాని.. అనూప్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. మొదటి సినిమాలో ప్రపంచాన్ని కాపాడే హీరో పాత్రలో నటిస్తే.. ఇప్పుడు మాత్రం తన ప్రేమ కోసం ఒక చిన్నదానికోసం ధైర్య సాహసాలను చూపిస్తున్నాడు అఖిల్. డిసెంబర్ 22న సినిమా వస్తోంది.