Begin typing your search above and press return to search.

హలో టీజర్ పోస్టర్ ఎలా ఉందంటే..

By:  Tupaki Desk   |   13 Nov 2017 3:45 AM GMT
హలో టీజర్ పోస్టర్ ఎలా ఉందంటే..
X
అక్కినేని కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం లాంటి మూవీ ‘మనం’. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రాన్ని ఓ వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో అందంగా తీర్చిదిద్ది ఆ కుటుంబంతో పాటు అందరి ప్రశంసలూ అందుకున్నాడు డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్. అందుకే తన చిన్న కొడుకు అఖిల్ కెరీర్ ను ఓ గాడిలో పెట్టే బాధ్యతను అతడి చేతుల్లోనే పెట్టాడు హీరో నాగార్జున. ‘హలో’ సినిమా ద్వారా అఖిల్ ను రీ లాంచ్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు.

తాజాగా హలో సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ బయటకు మళ్ళీ లీకైంది. ఇందులో హీరో అఖిల్ ఓ రేస్ బైక్ నడుపుతూ కనిపించాడు. ఈ పోస్టర్ వెనుకన టీజర్ ఫాస్ట్ సూన్ అనే లెటర్లు ఇంగ్లిష్ లో కనిపిస్తోంది. రయ్ రయ్ మంటూ హలో టీజర్ ప్రేక్షకులకు ముందు రానుందనే సంకేతం ఇచ్చేందుకే ఈ పోస్టర్ విడుదల చేస్తున్నారని అక్కినేని అభిమానులంతా సంబరపడుతున్నారు. ఈ పోస్టర్ లో అఖిల్ అప్పియరెన్స్ కూడా అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. మనం సినిమా ఎండింగ్ లో అఖిల్ కామియో రోల్ లో బైక్ రైడర్ గానే కనిపిస్తాడు. అదే తరహాలో ఇక్కడ కూడా కనిపించాడు.

హలో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై హీరో నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు. మొదటి సినిమా అఖిల్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టడంతో ఈ సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. దీనికితోడు ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి హలో సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.