Begin typing your search above and press return to search.

అఖిల్ హీరోయిన్లు భలే ఉన్నారే

By:  Tupaki Desk   |   24 Dec 2017 9:51 AM IST
అఖిల్ హీరోయిన్లు భలే ఉన్నారే
X
ఫైనల్ గా అఖిల్ బాబు సెకండ్ స్టెప్ సక్సెస్ గా వేశాడు. హలో సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అక్కినేని ఫ్యామిలీ వారు సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి క్రిస్మస్ సంక్రాంతి పండగల కంటే ఎక్కువ ఆనందాలు వారికి అందరికంటే ముందే వచ్చాయి. ఈ సక్సెస్ తో ఆ రెండు పండగలను ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా అభిమానులను కూడా కలిసి కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నారట.

త్వరలొనే సక్సెస్ మీట్ లు ఉంటాయని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా మరొకరికి కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆమె ఎవరో కాదు అఖిల్ తో రొమాన్స్ చేసిన కల్యాణి ప్రియదర్శిని. మొదటి సినిమాతోనే అమ్మడు నటనలో మంచి మార్కులను కొట్టేసింది. అంతే కాకుండా నెక్స్ట్ ఆఫర్స్ కూడా వస్తున్నాయని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అయితే సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్ర జున్ను క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.

ఆ పాప చూపించిన హావభావాలు అందరికి బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అయితే ఆ చిన్నారి హార్ట్ ని టచ్ చేసింది. మొదట దర్శకుడు విక్రమ్ కుమార్ పాత్రలను నడిపించిన తీరుని మెచ్చుకొని తీరాల్సిందే.