Begin typing your search above and press return to search.

రామ్‌ ఇంత భారం మోయగలడా?

By:  Tupaki Desk   |   17 Oct 2018 3:41 AM GMT
రామ్‌ ఇంత భారం మోయగలడా?
X
ఎనర్జిటిక్‌ రామ్‌ ‘నేను శైలజ’ చిత్రం తర్వాత చేసిన ‘హైపర్‌’ మరియు ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాలు అంతగా అలరించలేక పోయాయి. రామ్‌ కెరీర్‌ ఒక్క సక్సెస్‌ రెండు ఫ్లాప్‌ లు అన్నట్లుగా సాగుతోంది. ఇలాంటి సమయంలోనే రాబోతున్న చిత్రం ‘హలో గురూ ప్రేమకోసమే’. రెండు ఫ్లాప్‌ ల తర్వాత తెరకెక్కిన చిత్రం అయినా కూడా ఈ చిత్రంపై అంచనాలు, ఆసక్తి బాగానే ఉంది. ఎందుకంటే ఈ చిత్రంను త్రినారధ రావు నక్కిన దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించాడు. దసరా కానుకగా రేపు ఈ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

ఈ చిత్రంను దిల్‌ రాజు 25 కోట్లకు అమ్మేసినట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. రామ్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత భారీ మొత్తం రికవరీ చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా సూపర్‌ హిట్‌ అయితే తప్ప డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లో పడటం కష్టం. రామ్‌ గత సినిమాల విషయాన్ని చూస్తే సక్సెస్‌ టాక్‌ ను దక్కించుకున్న చిత్రాలు కూడా ఇంతటి షేర్‌ ను రాబట్టలేక పోయాయి. అందుకే ఇంత భారం రామ్‌ మోయలేడేమో అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రంలో తనకు జోడీగా నటించిన అనుపమ పరమేశ్వరన్‌ తోనే రామ్‌ ఈ చిత్రంలో మరోసారి నటించాడు. అనుపమ గత చిత్రాలు కూడా సో సోగానే ఆడాయి. దిల్‌ రాజు ఈ ఏడాది అంతగా ప్రభావం చూపించలేక పోతున్నాడు. హీరో రామ్‌, హీరోయిన్‌ అనుపమ, నిర్మాత దిల్‌ రాజు లు ముగ్గురు కూడా ఫ్లాప్‌ ల్లోనే ఉన్నారు. దర్శకుడు త్రినాధరావు మాత్రమే కాస్త జోరు మీదున్నాడు. ఆయన జోరుతో ఈ ముగ్గురికి సక్సెస్‌ దక్కేనా అనేది చూడాలి.