Begin typing your search above and press return to search.
ప్రేమలో స్టార్ హీరో వారసుడు.. 25 ఏళ్లకే అవసరమా?
By: Tupaki Desk | 3 Jan 2022 12:58 PM ISTప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో కొందరు నాలుగు పదుల వయసు మీద పడ్డా కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. టాలీవుడ్ హీరోల్లో ఎక్కువ శాతం మూడు పదుల వయసు దాటితే కాని పెళ్లి గురించి ఆసక్తి చూపడం లేదు అనేది టాక్. ఇలాంటి సమయంలో పాతికేళ యంగ్ హీరో అప్పుడే ప్రేమలో పడ్డాడు అంటూ వార్తలు వస్తున్నాయి. పెద్దలను ఒప్పించి ఒకటి రెండేళ్లలో పెళ్లి కూడా చేసుకుంటాడు అంటూ తమిళ మీడియా వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ యంగ్ హీరో మరెవ్వరో కాదు తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్. హీరోగా మన అర్జున్ రెడ్డి తమిళ వర్షన్ తో ఈయన పరిచయం అయ్యాడు. అక్కడ ఆదిత్య వర్మ గా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం తండ్రితో కలిసి ఒక సినిమాను మరియు సోలో హీరోగా రెండు సినిమాలను ధృవ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తండ్రితో నటిస్తున్న సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. సోలో హీరోగా సినిమాలు మొదలు అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెరీర్ ఆరంభ దశలో ఉన్న కారణంగా ధృవ్ ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది సినిమాల మీద.. కాని ఆయన ఫోకస్ తప్పినట్లుగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాతికేళ్లకే ప్రేమ అవసరమా.. హీరోగా చేయాల్సింది చాలా ఉంది.. సాధించాల్సింది ఇంకా ఉంది. కనుక ఖచ్చితంగా ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకోవాలంటే కష్టపడాలని అభిమానులు యంగ్ హీరోకు సూచిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ధృవ్ ప్రేమిస్తున్న అమ్మాయి విషయానికి వస్తే ఆమె పేరు బనిత సంధు. భారత సంతతికి చెందిన బ్రిటన్ బ్యూటీగా ఈ అమ్మడు ఇండియన్ సినిమా ద్వారా పరిచయం అయ్యింది. వీరిద్దరు కలిసి నటించి మెప్పించారు. సినిమా షూటింగ్ తర్వాత కూడా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందనే పుకార్లు తమిళ మీడియాలో వస్తున్నాయి. దాంతో అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు వారి కామెంట్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. కనీసం అయిదు ఆరు వరుస సినిమాలు చేసి సక్సెస్ లు దక్కించుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న తర్వాతే ఇతర విషయాల గురించి ఆలోచిస్తే బెటర్ అని.. లేదంటే కెరీర్ లో నష్టపోవాల్సి వస్తుందంటూ విక్రమ్ అభిమానులు ధృవ్ కు సలహా ఇస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ధృవ్ కాని బనిత కాని ప్రేమ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అలా అని కొట్టి పారేయలేదు. కనుక ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.