Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: థైషో‌తో కుమారి పెను దుమారం

By:  Tupaki Desk   |   16 Sept 2020 10:15 AM IST
ఫోటో స్టోరి: థైషో‌తో కుమారి పెను దుమారం
X
కుమారి హెబ్బా ప‌టేల్ గురించి ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు. ఈ భామ‌ కెరీర్ ఆరంభం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగినా.. ఇటీవ‌ల‌ ఒడిదుడుకుల గురించి తెలిసిందే. `అలా ఎలా` చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ముంబై హాట్‌ బాంబ్ హెబ్బా ప‌టేల్ తొలి సినిమాతో ఆక‌ట్టుకుని `కుమారి 21ఎఫ్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకుంది. ఆ త‌ర్వాత వెనుదిరిగి చూసిందే లేదు. యంగ్ హీరో రాజ్‌ తరుణ్ వ‌రుస‌గా అవ‌కాశాలిచ్చి హెబ్బాని ఎంక‌రేజ్ చేసాడు.

ఇక బోల్డ్ గా లిప్ లాక్ ల‌కు ఎక్స్ పోజింగుకి ఏమాత్రం అడ్డు చెప్ప‌ని ముంబై భామ‌గా హెబ్బాకి టాలీవుడ్ లో మంచి క్రేజు ఉంది. కానీ ప‌రాజ‌యాలే ఇబ్బంది పెట్టాయి. ఇటీవ‌ల‌ దాదాపు రెండేళ్ల పాటు సినిమాలు చేయలేదు. ప్ర‌స్తుతం `భీష్మ`లో గెస్ట్ రోల్ లో మెరిసిన ఈ ముంబయి భామ ప్రస్తుతం రాజ్‌ తరుణ్ తో మరోసారి `ఒరేయ్‌ బుజ్జిగా`లో కీలక పాత్ర పోషించింది. దీంతోపాటు రామ్‌ హీరోగా రూపొందుతున్న `రెడ్‌`లో ఐటెమ్‌ నెంబర్ లో తన గ్లామర్‌ షోతో మరింత కిక్కెంచేందుకు సిద్ధంగా ఉంది. హీరోయిన్ గా మాత్రం ఇప్పుడు హెబ్బాకి ఆఫ‌ర్లు అంతంత మాత్ర‌మే.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో హెబ్బా ట్రీట్ హాట్ టాపిక్ గా మారింది. తాజా ఫోటో షూట్ కి హెబ్బా అదిరిపోయే పోజులిచ్చింది. ఇందులో హెబ్బా థైషోస్ అద‌ర‌హో అంటూ అభిమానులు హీటెక్కిపోతున్నారు. వైట్ టాప్ లో థై అందాల్ని తెర‌ప‌రిచేసిందిలా. ఇక‌ ఆమె ఓరచూపులతో క‌వ్విస్తున్నలుక్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. మ‌త్తెక్కించే లుక్ తో చిత్తు చేసే చూపులతో రెచ్చిపోతోంది. ఇంత‌గా మైకం క‌మ్మే చూపులతో కుమారి క‌వ్విస్తుంటే ఏ కుర్రాడికైనా కునుకు క‌రువేగా!