Begin typing your search above and press return to search.
హెబ్బా పటేల్ ఫేడ్ ఔట్
By: Tupaki Desk | 15 Dec 2020 2:00 PM ISTకుమారి 21ఎఫ్ సినిమాతో అనూహ్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కాని ఈమెకు అనుకున్న స్థాయిలో ఆఫర్లు రాలేదు. వచ్చినవి కూడా సక్సెస్ అవ్వక పోవడంతో మెల్ల మెల్లగా ఆమె కెరీర్ డౌన్ ఫాల్ మొదలైంది. ఈ అమ్మడు వెబ్ సిరీస్ లు చిన్న సినిమాలు చేసుకుంటున్న ఈ సమయంలో కరోనా వల్ల ఆమె కెరీర్ మరింతగా కష్టాల్లోకి జారి పోయినట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం అమ్మడికి ఎక్కడ కూడా ఆఫర్లు కనిపించడం లేదు.
ఈమె బోల్డ్ గా నటించేందుకు సిద్దంగా ఉన్నా ఎలా అడిగితే అలా నటించేందుకు సిద్దంగా ఉన్నా కూడా మేకర్స్ మాత్రం ఈమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం చేస్తున్న ఒకటి రెండు సినిమాలు మినహా ఈమెకు పెద్దగా సినిమాలు ఏమీ లేవు అనేది ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కుమారి 21ఎఫ్ తో వచ్చిన ఈ అమ్మడు మెల్ల మెల్లగా ఫేడ్ ఔట్ అవుతూ మొత్తానికే కనిపించకుండా పోతుందా అంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు రెగ్యులర్ గా హాఫ్ ఫొటో షూట్ లు ట్రెడీషన్ ఫొటోలు షేర్ చేసి మేకర్స్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మళ్లీ ఈ అమ్మడికి లక్ కలిసి వచ్చి ఆఫర్లు వస్తాయా లేదంటే హెబ్బ పటేల్ చరిత్రలో మిగిలి పోనుందా అనేది కాలమే నిర్ణయించాలి.