Begin typing your search above and press return to search.

వామ్మో.. మూడు నాలుగు లిప్‌ లాక్‌ లే!!

By:  Tupaki Desk   |   18 Nov 2015 5:09 AM GMT
వామ్మో.. మూడు నాలుగు లిప్‌ లాక్‌ లే!!
X
ప్ర‌స్తుతం కుమారి 21 ఎఫ్ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ర్టీ. ఈ మూవీలో నాలుగు లిప్‌ లాక్‌ లు వేశాడు రాజ్‌ త‌రుణ్‌. ముంబై నుంచి వ‌చ్చిన కొత్త పోరి హేబా ప‌టేల్ లిప్‌ లాక్‌ ల‌కు నయ్ చెప్ప‌కుండా ఉయ్ అంటోందంటూ కుర్ర‌కారులో ఒక‌టే గుస‌గుస‌లు. ఒక‌టి కాదు.. రెండు కాదు ఏకంగా నాలుగు లిప్‌ లాక్‌ ల‌తో రెచ్చిపోయింది. రాజ్‌ త‌రుణ్‌ ని ముద్దుల్లో ముంచేసింద‌న్న‌ది ఇన్‌ సైడ్ టాక్‌.

అయితే ఇలా లిప్‌ లాక్‌ లు వేసేప్పుడు.. సిగ్గేయ‌లేదా? అని హేబాని ప్ర‌శ్నిస్తే ఏం చెప్పిందో తెలుసా? అన్సెట్స్ అంత‌మంది ముందు లిప్ లాక్‌ లు వేయాలంటే చాలా సిగ్గుగానే ఉంటుంది. అందుకే ముందుగా రాజ్‌ త‌రుణ్‌ తో క‌లిసి ట్రైనింగ్ సెష‌న్స్‌ లో ప్రాక్టీస్ చేశాను.. అంటూ గ‌డుసుగా స‌మాధానం చెప్పింది. అస‌లు ముద్దులు పెట్టుకుంటే త‌ప్పేంటి? అన్న‌ట్టే ప్ర‌శ్నించింది ఈ గ‌డుస‌రి పాప‌. ముందే ప్రాక్టీస్ చేసిన‌ప్పుడు ప‌ని చాలా సులువైపోతుంది క‌దా! అని చెప్ప‌క‌నే చెప్పింది.

నువ్వే నా ఫ‌స్ట్ బోయ్‌ ఫ్రెండ్‌. నీతోనే నా ఫ‌స్ట్‌ కిస్సు.. నీతోనే అన్నీ అంటూ ట్రైల‌ర్‌ లో గారాలు పోయింది. నా హైటు ఫైవ్ ఫోర్‌. నా వెయిటు 48 - వెయిస్ట్ 24 .. ఏ ఈ కొల‌త‌లు చాల‌వా ? అంటూ గ‌డుగ్గాయ్‌ లా అమ్మ‌డు వేసిన ప్ర‌శ్న‌లు కుర్ర‌కారు గుండెల్ని త‌డిమేశాయంటే అతిశ‌యోక్తి కాదు. అందుకే ఈ 20న రిలీజ‌వుతున్న సినిమాల్లో కుమారి 21 ఎఫ్‌ కి గెలుపు సాధ్య‌మేన‌ని అనుకుంటున్నారు.